విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం.


 

విద్యుత్ శాఖ అధికారులతో  కలెక్టర్ సమావేశం.


ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ పధకంపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్  పి. రాజాబాబు, విద్యుత్ శాఖ అధికారులను  ఆదేశించారు.బుధవారం సాయంత్రం  ప్రకాశం కలెక్టరేట్ లోనిసమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు,   ట్రాన్స్ కో, సి పి డి సి ఎల్, ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లి. (NREDCAP) అధికారులతో  ప్రత్యేక సమావేశమై  ఆయా శాఖల ద్వారాఅమలుజరుగుచున్నకార్యక్రమాల అమలు తీరును, పురోగతిని సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ద్వారా జిల్లా కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అంతరాయం కలగకుండా సరఫరా చేసేలా  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

ప్రధాన మంత్రి  సూర్య ఘర్ పధకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

 ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు  80,811 దరఖాస్తులు రాగా, అందులో 2,553 దరఖాస్తులు గ్రౌండింగ్ చేయగా, 2,442 సోలార్ ఇన్సులేషన్ పూర్తి చేయడం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు, కలెక్టర్ కివివరించారు. రోజువారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని  జిల్లాలో పీఎంసూర్యఘర్అమలునువేగవంతంచేయాలనిజిల్లాకలెక్టర్,విద్యుత్ శాఖఅధికారులనుఆదేశించారు.  

క్షేత్ర స్థాయిలో అన్నీ వర్గాల ప్రజలను,  భాగస్వాములను చేసి అన్ని గ్రామాల్లోనూ సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 

సౌర విద్యుత్ వినియోగం వలన కలిగే ప్రయోజనాలను, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని ప్రజలకు వివరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.  

ట్రాన్స్ కో ద్వారా చేపట్టిన సబ్ స్టేషన్ పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ త్వరగా పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. 

  క్షేత్ర స్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే తెలపాలని సూచించారు. విద్యుత్ సరఫరా లో ప్రజలు సంతృప్తి చెందేలా విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమావేశంలో సి పి డి సి ఎల్ ఎస్ ఈ  వెంకటేశ్వర రావు,  ట్రాన్స్ కో ఎస్ ఈ రాజగోపాల నాయుడు,   NREDCAP డెవలప్మెంట్ అధికారి శ్రీ వంశీకృష్ణ,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post