గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ అవసరము - కలెక్టర్ .పి.రాజాబాబు.


 గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ అవసరము - కలెక్టర్ .పి.రాజాబాబు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రకాశ భవనంలోని కార్యాలయంలో కలెక్టర్ .పి.రాజాబాబు మాట్లాడుతూ గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావలసిన ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు. గనులు, ఏపీ ఎండీసీ, పర్యావరణ కాలుష్యం నియంత్రణ మండలి, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలోని గనుల విస్తీర్ణము,  వాటి రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయము, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, తదితర వివరాలు పై కలెక్టర్ ఆరా తీశారు. ఆయా వివరాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కలెక్టరుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఇదే సమయానికి 18% వృద్ధి ఉన్నట్లు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్య ప్రభుత్వం మన జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక జిల్లాలోని 12 స్టాక్ యార్డులలో అందుబాటులో ఉందన్నారు. 

         ఈ సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ.ఈ. రాఘవరెడ్డి, డిటిసి సుశీల, ఆర్టీసీ ఆర్ఎం జి.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post