గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న బిజెపి ఏలూరు జిల్లా అధ్యక్షులు, దెందులూరు కూటమి నాయకులు.
నేషనల్ హైవేపై భారీ స్థాయిలో కంటైనర్లలో గోవుల అక్రమ రవాణా - ఏలూరు జిల్లాలో అడ్డుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు, దెందులూరు కూటమి నాయకులు.
అరకు నుంచి చిలకలూరి పేటకు భారీ కంటైనర్ల లో గోవులను అక్రమంగా తరలిస్తున్న వైనం.
గూడ్స్ రవాణా పేరుతో రహస్యంగా గోవుల తరలింపు చేస్తున్న లైవ్ స్టాక్ క్యారియర్ నిర్వాహకులు.
పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహన సెస్సు వివరాలను పరిశీలించిన దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది.
3కంటైనర్ లలో భారీగా తరలిస్తున్న దాదాపు 75 జీవాల గుర్తింపు.
ఎ ఎం సి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన నిర్వాహకులు.
సమాచారం అందుకుని ఘటన ప్రాంతానికి చేరుకున్న దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ సహా వివిధ శాఖల అధికారులు.
తమ వాహనాల్ని అడ్డుకుంటే తొక్కించుకుంటూ వెళ్ళిపోతామంటూ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారంటున్న సిబ్బంది.
దెందులూరు ఎ ఎం సి చైర్మన్, బిజెపి నాయకులు రంగంలోకి దిగటంతో పరారయిన నిర్వాహకులు.
ఏపీ 39డబ్ల్యూ 4035, ఏపీ 39 డబ్ల్యూ ఇ 8528 సహా పలు కంటెయినర్ల లో అక్రమంగా మూగజీవాలను కబేళాలు కి తరలిస్తున్నట్లు వెల్లడి.
గోవులను కాపాడి స్థానిక గోసంరక్షణ శాలకు తరలించడానికి ముమ్మర ఏర్పాట్లు.
ఈసందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ: గోవుల అక్రమ రవాణాపై సహించం..రాక్షసంగా, క్రూరంగా గోవులను తరలిస్తున్నారు..దీని వెనుక ఉన్న వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. దెందులూరు ఎ ఎం సి, ఏలూరు పార్లమెంట్ నాయకులు కృష్ణప్రసాద్ సహా పలువురు నాయకుల ఆధ్వర్యంలో లారీ నిలుపుదల చేయటం జరిగింది. ప్రతిసారి ఇలా పట్టుకోవటం గోశాలకు అందిస్తున్నాం, కానీ గో శాలల్లో నామ మాత్రపు చర్యలు వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి..ఇకపై అలా జరగకుండా ప్రభుత్వం మరిన్ని కటిన చర్యలు చేపట్టాలని..ఇలాంటి ఘటనలు ముక్తా కంఠంతో ఖండిస్తున్నాం, ఇకపై ఇలాంటివి జరిగితే చూస్తూ ఉపేక్షించం అని కూడా తెలియచేస్తున్నాం అని తెలిపారు. ఇటువంటి ఘటనల్లో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసి అరికట్టేల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం అని తెలిపారు.
దెందులూరు వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత మాట్లాడుతూ "అనధికారికంగా గోవులను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలుపుదల చేయగా, దానికి సంబంధించిన నిర్వాహకులు తాము గత వైసిపి ప్రభుత్వం హయాం నుంచి కూడా యదేచ్చగా గోవుల అక్రమ రవాణా ఇలాగే కొనసాగిస్తూ ఉన్నామని ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిందని ఈ విధంగా అడ్డుకుంటే ఊరుకోబోమని చెప్పి, అక్రమ రవాణా చేస్తున్న నిర్వాహకులు మార్కెట్ కమిటీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం జరిగిందని దీంతో సమాచారం అందుకొని తాను మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు కిషోర్ గారూ సహా కూటమి నాయకులు చేరుకుని గోవుల అక్రమ రవాణాన్ని అడ్డుకోవడం జరిగిందని వైసీపీ హయాంలో జరిగినట్లు అక్రమాలు కూటమి ప్రభుత్వంలో కొనసాగనివ్వమని తెలిపారు.
----------

