అంగరంగ వైభవంగా హేలాపురి ఉత్సవం గ్రాండు షాపింగు ఫెస్టివల్- జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.


అంగరంగ వైభవంగా హేలాపురి ఉత్సవం గ్రాండు షాపింగు ఫెస్టివల్- జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.

జిఎస్టీ ఫలాలు ప్రజలకు చేరి, వారికుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలి.

సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు పూర్తి అవగాహన కలిగించాలి.

ఏలూరు, అక్టోబరు 15: స్థానిక సిఆర్ రెడ్డి కళాశాల గ్రౌండులో బుధవారం సాయంత్రం పండుగ వాతావరణంలో జరిగిన మూడవ రోజు *హేలాపురి ఉత్సవం* గ్రాండు షాపింగు ఫెస్టివల్ ను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సందర్శించారు. ప్రతి స్టాల్ ను సందర్శించి, స్టాల్ లో ఉన్న వస్తువులు పాత ధర, కొత్త ధర తేడాను గమనించి, ఇదే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కొన్ని వస్తువులను జిల్లా కలెక్టరు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థిని, విద్యార్థులుచే ప్రదర్శించిన నృత్యాలు ప్రజలుతో కలిసి జిల్లా కలెక్టరు తిలకించారు.

ఈ సందర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ద్వారా తీసుకువచ్చిన సంస్కరణలు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వారికి ప్రతినెల కొంత ఆదాయం పొందుతారని అన్నారు. ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని, జీఎస్టీ సంస్కరణలతో మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతమిస్తూ భారతీయ, రాష్ట్ర బ్రాండ్లు గ్లోబల్‌ మార్కెట్‌లో పోటీ పడే పరిస్థితులు ఏర్పడ తాయన్నారు. దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశ, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని, ఈ సంస్కరణలు ప్రతి ఇంటికీ మంచి ఆదాయం పెరుగుతుందని అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు ఏలా మేలు జరిగిందో అదే విధంగా ప్రస్తుత సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సూపర్‌ జీఎస్టీగా మార్చిందని అన్నారు. దీని ద్వారా కూడా ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని, కిరాణా సామాగ్రి గతంలో ఉన్న శ్లాబ్‌ను తగ్గించడం జరిగిందని, కొన్నింటిపై జిఎస్టీ తీసివేయడం జరిగిందన్నారు. జిఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి నెలసరి రూ 5 వేలు నుండు 15 వేలు ఆదాయం పొందుతారని తెలిపారు. నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు జీవితాలకు వెలుగులు నింపటమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు అమలు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

కార్యక్రమంలో ఆర్డీవో యం.అచ్యత అంబరీష్, వాణిజ్యపన్నుల శాఖ జాయింటు కమీషనరు నాగార్జున రావు, జిల్లా పరిషత్తు సిఇవో యం.శ్రీహరి, ఉపరవాణా కమీషనరు షేక్ కరీం, ఏలూరు నగరపాలక కమీషనరు ఏ.భానుప్రతాప్, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనరు జి.నాగేశ్వరరావు, వివిధ శాఖలు అధికారులు, ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరు అయ్యి వివిధ రకాలు వస్తువులు కొనుగోలు చేశారు.

 

Post a Comment

Previous Post Next Post