మహిళా సాధికారత దిశగా ఉగ్ర నరసింహారెడ్డి మరో ముందడుగు - మంత్రి స్వామి.

మహిళా సాధికారత దిశగా ఉగ్ర నరసింహారెడ్డి మరో ముందడుగు - మంత్రి స్వామి.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

- పండుగ వాతావరణంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ,

 ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, జనని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గత ఒక సంవత్సరంగా ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని, మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 140 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అమరావతి గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు

పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

దీపావళి వెలుగులు ప్రతి ఇంటిలో వెలగాలని, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షిస్తూ, కనిగిరి శాసనసభ్యులు Dr ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మహిళలకు దీపావళి కానుకగా ఈ కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయం. జిల్లాలో ఎవరూ చేయని అభివృద్ధి కనిగిరిలో జరుగుతోంది. ఇది ఉగ్ర నరసింహారెడ్డి కృషికి నిదర్శనం అని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా కనిగిరిఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ

మహిళలు ఆర్థికంగా ఎదిగి అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకొని గత ఏడాది నుండి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నాం. 

ఈ మిషన్లు స్వయంశక్తితో జీవనోపాధి పొందేందుకు దోహదపడతాయి. ప్రతి మహిళ తన ప్రతిభను వినియోగించి స్వయం ఆధారంగా ఎదగాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొగ్గరపు శ్రీలత సద్గురు, ఆర్డిఓ. కేశవర్ధన్ రెడ్డి, డీస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Add



 

Post a Comment

Previous Post Next Post