యార్లగడ్డ నేతృత్వంలో గన్నవరం అభివృద్ధి : వసంత.
గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాజీ హోం మంత్రి, అప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరావు హర్షం వ్యక్తం చేశారు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన యార్లగడ్డను కలిసి పలు అంశాలపై చర్చించారు గన్నవరంలో రహదారుల అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధికి, సంక్షేమ పధకాల అమలు చేయటంలో యార్లగడ్డ చేపట్టిన ప్రత్యేక చొరపై వసంత నాగేశ్వరావు అభినందించారు. యార్లగడ్డ నేతృత్వంలో గన్నవరం దశ, దిశ మారుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవడం తోపాటు అవినీతి రహిత పాలనందిస్తున్న యార్లగడ్డ ను ప్రత్యేకంగా అభినందించారు. యార్లగడ్డ ను ఎమ్మెల్యే గా గెలిపించుకోవడం గన్నవరం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా వసంత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Add

