రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు విడుదల చేయండి.



 

రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు విడుదల చేయండి.

విజయవాడ అమరావతి. 

విదేశీ విద్య పథకానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ నిధులు ఇవ్వాలి.

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.

సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ని కోరిన మంత్రి డా.స్వామి.

రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం నాడు విజయవాడ వివంత హోటల్ లో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో మంత్రి డా.స్వామి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావలసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు రూ.34 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ నిధులు ఇవ్వాలని మంత్రి స్వామి కోరారు. రాష్ట్రంలో ఎస్సి విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని మంత్రి స్వామి కేంద్ర మంత్రికి వివరించారు. నెల రోజుల్లో అట్రాసిటీ పెండింగ్ నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారని, అన్ని అంశాలకు ఆయన సానుకూలత తెలిపినట్లు మంత్రి డా. స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల సహకరిస్తున్న ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు..

Post a Comment

Previous Post Next Post