ఒంగోలు విమానాశ్రయం మరియు తదితర అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ని కలిసిన - మాగుంట.


 ఒంగోలు విమానాశ్రయం మరియు తదితర అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ని కలిసిన - మాగుంట.

   ఈ రోజు వెలగపూడి లోని సచివాలయంలో ముఖ్యమంత్ర్రి  కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి.

ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై చర్చించినారు.

   ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాలలో బాగా వెనుకబడిఉన్నందున, దాని పరిధిలో భూ సేకరణ జరిగిన ఒంగోలు విమానాశ్రయం నిర్మాణ అనుమతులు త్వరితగతిన పొంది, పనులు మొదలు పెట్టడం గురించి, కొండపి, కనిగిరి, మార్కాపురం మరియు యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 39 రోడ్లు పునర్నిర్మాణానికి పి.యం.జి.ఎస్.వై. ( వి ఐ ) పధకం క్రింద రూ. 135 కోట్లు మంజూరు చేయించడం గురించి, కోస్టల్ కారిడార్ రోడ్డు నిర్మాణం గురించి మరియు పీ ఎం ఈ బస్సు - సేవా పధకం క్రింద ఒంగోలు లోని ఏపీ ఎస్ సి ఆర్ టి సి కి ఎలక్ట్రిక్ బస్సులను కేయించాలని కేంద్రంతో సంప్రదించి వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయవలసినదిగా ముఖ్యమంత్రిగాని కోరినారు.  దానికి ముఖ్యమంత్రిసానుకూలంగా స్పందించి కేంద్రంతోసంప్రదించిఒంగోలువిమానాశ్రయం, పి.యం.జి.ఎస్.వై. ( ఐ వి ) పధకం క్రింద రోడ్లు, కోస్టల్ కారిడార్ రోడ్డు మరియు ఒంగోలు ఆర్టిసి కి ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే మంజూరు చేస్తానని తెలియజేసినారు.

Add


Post a Comment

Previous Post Next Post