కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలు ప్రతి గిరిజన కుటుంబాలకు అందేలా అధికార్లు ప్రత్యేకదృష్టి పెట్టాలి.
మండల స్థాయిలో అవ్వని పనులు, డివిజన్ స్థాయిలో అక్కడ కాలయాపనలు జరిగితే జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చూపాలి.
గిరిజన ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పర్యటించి అభివృద్ధి, సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాను.
జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి.
ఏలూరు/ ఏలేరుపాడు, అక్టోబరు 06: ఏలేరుపాడు మండలం మోదేల గ్రామంలో అంగన్వాడీ సెంటరు వద్ద సోమవారం వివిధ శాఖల అధికారులు, షెడ్యూల్డ్ తెగల సంఘాలు ప్రతినిధులు, నాయకులు, గిరిజన ప్రజలు సమావేశంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావుతో కలిసి జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ పాల్గొన్నారు. దొరమామిడి గ్రామం నుండి మోదెల గ్రామం వరకు సుమారు 12 కిలోమీటర్లు జీప్ పై ప్రయాణం చేశారు. జాటోత్ హుస్సేన్ కు గిరిజన ప్రతినిధులు, తండా ప్రజలు అపూర్య ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుని ఆప్యాయతతో పలకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఏలా జరుగు తున్నాయని, ప్రస్తుత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు వివరాలు 15 రోజుల్లోగా నివేదికలు ఇవ్వాలని, మూడు నెలల్లో పనులకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కొన్ని గ్రామాలు ఇంకా మాజీ మంత్రి జలగం ప్రసాద రావు జెవిఆర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రతి గిరిజనుడు కి స్టీలు కంచం, గ్లాసును, స్వీట్ ను సభ్యులు జాటోత్ హుస్సేన్ అందజేశారు. ఇచ్చిన ప్రతి అర్జీని స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ప్రతి గిరిజన తండాకు ఇండ్ల నిర్మాణాలు, రహదార్లు, విద్యుత్తు, తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారని తెలిపారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అధికారుల వైఫల్యం కనబడుతుందని, అలాగే ఇక్కడ ప్రజలు, నాయకులు సరిగ్గా స్పందించలేదని తెలుస్తుంది అన్నారు. ఇప్పటికైనా 15 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని, మూడు నెలలోగా పనులకు శ్రీకారం చేసేలా చర్యలు చేపడతానన్నారు. ప్రతి గ్రామంలో సెల్ టవర్లు ఏర్పాటు చేసి సెల్ ఫోన్లు, టీవీలు పనిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అడవిలో మొక్కలు, జంతువులు కన్నా గిరిజనులు ప్రాణం ముఖ్యమని, చట్టం కూడా ఇదే చెప్తుందని అన్నారు. అడవిలో తిరిగే హక్కు జీవించే హక్కు ప్రతి గిరిజనుడికి ఉందని, వారి సంక్షేమం, అభివృద్ధికి అధికారులు మనస్సు పెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలన్నారు. గిరిజన తండాలు అభివృద్ధికి అటవీశాఖ, ఇతర శాఖలు తరఫున ఇవ్వవలసిన అనుమతులన్ని త్వరితిగతిన ఇవ్వాలని, గిరిజన తండాల అభివృద్ధికి అన్ని శాఖలు అధికారులు సంపూర్ణ మద్దతు ప్రకటించి పనులకు శ్రీకారం చుట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలు ప్రతి గిరిజన కుటుంబాలకు అందేలా అధికార్లు ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. మండల స్థాయిలో అవ్వని పనులు, డివిజన్ స్థాయిలో అక్కడ కాలయాపనలు జరిగితే జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చూపాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తానని అభివృద్ధి, సంక్షేమం శక్తివంచన లేకుండా కృషిచేస్తానని అన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి విషయంలో ఎవరూ కూడా కోర్టులకు వెళ్ళవద్దని, వెళ్ళితే సమయం, డబ్బు వృధా అవుతుందన్నారు. అదే నేరుగా ఎస్సీ కమీషన్ దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కారం అవుతుందని, సమయం, డబ్బు ఆదావుతుందని కేంద్ర ఎస్సీ కమీషన్ కు మేస్టీరియల్ అధికారాలు చాలా ఉంటాయని ప్రతి గిరిజన తండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, ఇంచార్చి ఆర్డీవో, యస్సి కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, డియఫ్ వో జి.సతీష్ రెడ్డి, జిల్లా ఆర్డబ్ల్యూయస్ అధికారి జి.త్రినాధబాబు, విద్యుత్ శాఖ ఇఇ ఫీర్ అహ్మద్ ఖాన్, గృహనిర్మాణ శాఖ ఇఇ కె.వి.వి.యస్.ప్రసాదు, డిప్యూటీ వైద్యఆరోగ్య శాఖ అధికారి డా. సురేష్, మండల వివిధ శాఖల అధికారులు, ఐటిడిఏ ఉద్యోగులు, సిబ్బంది, ఎస్టీ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కూటమి నాయకులు, గిరిజనప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

