ఏలూరు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ గా జి.వి. బాల సరస్వతి అదనపు బాద్యతలు స్వీకరణ.


ఏలూరు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ గా జి.వి. బాల సరస్వతి అదనపు బాద్యతలు స్వీకరణ.

 క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

ఏలూరు, అక్టోబర్, 6 : ఏలూరు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ గా జి.వి. బాల సరస్వతి అదనపు బాద్యతలు స్వీకరించినట్లు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ఈ నెల 8 వ తేదీ నుండి 14 వ తేదీ వరకూ ఏలూరు లో ప్రత్యేక ఆధర్ క్యాంపు లను కస్తూరిభా గవర్నమెంట్ స్కూల్, కోటదిబ్బ నందు 08-10-25 మరియు 09-10-25 తేదీల్లో గవర్నమెంట్ హై స్కూల్, రామకోటి దగ్గర 10-10-25 మరియు 11-10-25 తేదీల్లో జరుగుతుంది ఆమె తెలిపారు. విద్య వికాస్ స్కూల్, ఆర్.టి.సి. బస్టాండ్ దగ్గర జంగారెడ్డిగూడెం నందు 13-10-25 మరియు 14-10-25 క్యాంపులు జరుగుతాయన్నారు. 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల పిల్లలకు మొదటి బయోమెట్రిక్ అప్డేట్ మరియు 15 సంవత్సరాల నుండి 17 సంవత్సరం వారికి మొదటి లేదా రెండవ బయోమెట్రిక్ అప్డేట్ సేవలను ఉచితంగా అందించటం జరుగుతుందన్నారు. ఇతర సేవలను రూ. 75/- మరియు రూ. 125/- నామమాత్రపు రుసుముతో చేయబడునని, ఈ ఆధార్ క్యాంపులు ఉదయం 9.00 గం.ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు కొనసాగుతాయన్నారు. అవసరమైన విద్యార్థులు మరియు ప్రజలు ఈ ఆధార్ సేవలు ఉపయోగించుకోవలసిందిగా ఆమె కోరారు.

Post a Comment

Previous Post Next Post