జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందాలి - వ్యాపారులు, చార్టెడ్ అకౌంట్లతో సమావేశంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ .లంకా దినకర్.




జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందాలి - వ్యాపారులు, చార్టెడ్ అకౌంట్లతో సమావేశంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ .లంకా దినకర్.

ఒంగోలు

           కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల ప్రభావం వల్ల ప్రయోజనాలు ఏమిటి, ఆ ప్రయోజనాలు ఏవిధంగా ప్రజలకు బదలాయింపు జరగాలి, వినియోగదారుల కొనుగలు శక్తి ఎలా పెరుగుతుంది మరియు దేశ ఆర్థిక వ్యవస్థ పైన సానుకూల ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాల గురించి ప్రజలకు మరియు వినియోగదారులకు జరిగే మేలు పైన  అవగాహన కల్పించడానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్ లో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మెన్ లంకా దినకర్ గారు మరియు అతిథులుగా ఒంగోలు 

శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు,  వాణిజ్య పన్నుల  శాఖ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాశ్ గారు , డిఆర్ఓ ఓబులేసు గారు, ఒంగోలు చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరువాయి కుమార్ గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దేవతు శ్రీరాములు గారు మరియు ఎస్టీపీ అసోసియేషన్ అధ్యక్షులు రోశయ్య  గారు హాజరయ్యారు.

                   ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ… జీ ఎస్ టీ 2.O సంస్కరణల నిర్ణయాలు సక్రమంగా అమలు చేసి వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు మరియు  సేవలు న్యాయమైన ధరకు అందేలా పర్యవేక్షించే వినియోగదారుల కమిషన్ వారు, కేంద్ర ప్రభుత్వ సంస్కరణల ఫలాలు అందించవలసిన అసలైన్ మాధ్యమం వస్తు సేవల ఉత్పత్తి మరియు వర్తక వాణిజ్యం నెరిపే వారి కోసం ఏర్పడిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, ఛార్టర్డ్ అకౌంటెంట్స్, అడ్వొకేట్లు, డాక్టర్లు మరియు వినియోగదారులు హాజరైన ఈ జీఎస్టీ అవగాహన సదస్సు  “ సూపర్ జీ ఎస్ టీ - సూపర్ సేవింగ్స్  “ కు ముఖ్య అతిథిగా హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈరోజు దేశ ఆర్థిక ప్రగతి సాధనకు సేవలు అందించే  సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీ ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలను వినియోగదారులకు అందించాల్సిన భాద్యత వ్యాపారస్తుల నైతిక భాద్యత అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యానికి తూట్లు పొడవకుండా పేద మరియు మధ్య తరగతి ప్రజలకు అందవలసిన లాభం చేకూరుతున్నదో లేదో మరియు వస్తువు సేవల నాణ్యత విషయంలో రాజీ పడకుండా అందుతున్నాయో లేదో చూడవలసిన భాద్యత జీఎస్టీ అధికారులు మరియు వినియోగదారుల కమిషన్ వారిదన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ స్ఫూర్తితో సంస్కరణలు అమలు చేసి ప్రజలు మరియు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడానికి నిర్ణయం తీసుకుందో ఆ విషయానికి ఇక్కడ ఉన్న అధికారులు అనుసంధానం అయ్యి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చేలా 4 కేటగిరీలు 5%, 12%, 18% మరియు 28% నుండి వ 2 కేటగిరీలు 5% మరియు 18%కి GST రేట్లను పునర్వ్యవస్థికటించడం ద్వారా  జీఎస్టీ సంస్కరణలను అమలు చేసినందుకు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ సంస్కరణల వల్ల తగ్గిన ధరలకు సంబంధించిన మేలు వినియోగదారులకు అందేవిధంగా విషయ పరిజ్ఞాన్ని జీఎస్టీ మరియు వినియోగదారుల కమిషన్  అధికారులు చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ద్వారా మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రజలకు చేర్చే ప్రక్రియకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, క్షేత్రస్థాయిలో ప్రజలకు జీఎస్టీ సంస్కరణల పైన  ప్రజలు మరియు వినియోగదారుల స్పందన తెలుసుకునేందుకు మరియు అవగాహన కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం “ సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ “ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

           ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సానుకూల తీర్మానం చేసిన దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాల స్ఫూర్తి ప్రదాత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే అన్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ జీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం  జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిన తర్వాత, దేశంలోని 90% కుటుంబాలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు మరియు సేవలపై వారి రోజువారీ జీవన వ్యయం తగ్గి వారి పొదుపు పెరుగుతున్న శుభసందర్భంగా దేశ ప్రజలు దసరా మరియు దీపావళి పండుగలకు ముందే దాబుల్ దమాకా మూడ్‌లో ఉన్నారు.సంస్కరణల వల్ల జీఎస్టీ నుండి పూర్తి వెసులుబాటుతో జీవిత మరియు ఆరోగ్య బీమా ఖర్చు నుండి భారీ మొత్తంలో పొదుపు సాధ్యమవుతుంది, ఆహారం, ప్రాణాలను రక్షించే మందులు మరియు వైద్య పరికరాలు సున్నా లేదా 5%కి తగ్గించబడ్డాయి, పాఠశాల పిల్లలకు విద్యకు అవసరమైన పుస్తకాలు మరియు ఇతర అవసరాల కోసం సున్నా లేదా 5%కి తగ్గించబడ్డాయి, వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్లు మరియు నిర్మాణ అవసరాల కోసం సిమెంట్ ప్రస్తుత 28% నుండి 18కి తగ్గించబడ్డాయి, 1500 CC కంటే తక్కువ ఉన్న వాహనాల ధరలు కూడా తక్కువ జీఎస్టీ కారణంగా బాగా తగ్గుతున్నాయి. 

ఇప్పుడిప్పుడు ఏ ఏ వస్తువుల పైన ప్రధాని నరేంద్ర మోడీ జీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ  సంస్కరణలు చేసిందో వాటి అమలు తాలూకు ప్రతిఫలం వినియోగదారుల నోటి ద్వారా బయటకు వస్తున్నాయి, మొదటి రోజు  మధ్య తరగతి కుటుంబాలు వినియోగించే మారుతి చిన్న కారులను 30 వేలకు పైగా కొనుగోలు చేయడం ఒక రికార్డ్, ఇలా మిగతా బ్రాండ్ల కారుల మొత్తం అమ్మకాలు ఏంత ఉండవచ్చో ఊహించండి... అలా చుస్తే ప్రజల నిత్యావసర వస్తువులు పాలు, పెరుగు, నెయ్య మరియు ఇతర ఆహార వస్తువులు పైన లీటర్లు, కేజీల చొప్పున  ఏంత విలువైన ధర తగ్గిందో అధికారులు చార్టులు తయారు చేసి ప్రజల ముందు ఉంచాలని ఆదేశించడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం సులభతర వాణిజ్యం కోసం ఊతం ఇస్తూ జీఎస్టీ సంస్కరణలతో మన దేశంలోని సామాన్యులకు ప్రయోజనం చేకూర్చడం మరియు సరసమైన ధరకు అవసరమైన వస్తువులు మరియు సేవలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం.

జీఎస్టీ ద్వారా ఇప్పటి వరకు కేంద్రం దోచుకుంది అన్న వారికి  ఒక ప్రశ్న...  

దోచుకునేది కేంద్రం ఐతే తెలంగాణ మరియు తమిళనాడు ముఖ్యమంత్రులు స్పందించిన విధంగా  రాష్ట్రాలకు నష్టం ఎందుకు వస్తుంది? జీఎస్టీలో ఎన్ని కాంపొనెంట్స్ ఉంటాయో రాష్ట్రాలకు ఎంత వాటా వస్తుందో ప్రతి ఒక్కరికి తెలవాలి? ఇప్పుడే కాదు, 2017 లో జీఎస్టీ తెచ్చిన మొదట్లో కూడా జీఎస్టీ ద్వారా కొన్ని వస్తువులపై పన్నులు తగ్గుతున్నందున వచ్చే నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని అడగడం, కేంద్రం అంగీకరించడం అందరికీ గుర్తు చేయాలి? అప్పట్లో కేంద్రం విధించే సన్  వ్యాట్ (ఎక్సైజ్ సుంకం) పై రాష్ట్రాల వ్యాట్ గరిష్టంగా 17 శాతం ఉండేది. అది కూడా ఉత్పత్తి ధర+ ఉత్పత్తి సుంకాలపై/ అంటే ఉత్పత్తి ధరపై 18.5 శతం కంటె ఎక్కువే అయ్యేది. పన్నుల విధానం అవగాహణ ఉన్నవారికి తప్ప  ఇది అంత సులభంగా అర్థమయ్యే వ్యవహారం కాదు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడం మన బాధ్యత.

 వాస్తవం అర్థం కావాలంటే జీఎస్టీ రావడానికి ముందు గరిష్టంగా 31 శాతం ఉన్న పన్నులు 28 శాతానికి తగ్గాయి. అలాగే 18, 12, 5 శాతం పన్నులు ఉన్న వస్తువులపై కూడా జీఎస్టీ వచ్చాక కాస్తో కూస్తో ఉపశమనం కలిగింది. 

ఇప్పుడు ఎందుకు జీఎస్టీ తగ్గించారు:

కేవలం జీఎస్టీ మాత్రమే కాదు, 2014 లో గరిష్ట ఆదాయ పన్ను పరిమితి 2.50 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు 12.50 లక్షల రూపాయిలు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. సుపరిపాలనలో పన్నుల విధానం నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వాలు ఆదాయం పెంచుకుంటూ పన్నులను సాధ్యమైనంత మేరకు తగ్గించాలి, ప్రధాని నరేంద్ర మోడీ జీ అదే చేశారు. 2000 సంవత్సరం ముందు ఒక వస్తువు మరియు సేవలపైన రాష్ట్రానికొక అమ్మకపు పన్ను విధానం ఉన్నప్పుడు పన్ను పైన పన్ను కేస్కేడింగ్ పన్ను భారం అయ్యింది, 2000 సంవత్సరం తర్వాత వ్యాట్ విధానంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం వచ్చి కొంత భారం తగ్గింది కానీ ఒకే వస్తువు లేదా సేవల మీద రాష్ట్రానికొక పన్ను శాతం ఉండడం వల్ల సులభతర వాణిజ్యానికి ఇబ్బందులు కొనసాగాయి… ఆ పరిస్థితులలో 2017 లో ఒకే దేశం ఒకే పన్ను అనే విధానంకు కట్టుబడి దేశం మొత్తానికి ఏ వస్తువు అయినా, సేవ అయినా ఒకటే పన్ను శాతం విధానంతో వస్తు సేవల పైన అప్పటి వరకు రాష్ట్రాలు గరిష్టంగా 30% పైగా విధించిన పన్నుల కన్నా తక్కువగా 28% పరిగణనలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

జీఎస్టీ మొదట అమలులోకి వచ్చినప్పుడు  రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలకు అందించాలని 2017 లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు బహుళజాతి కంపెనీలను  కెంద్రం హెచ్చరిక జారీ చేసిన విషయం  గుర్తు పెట్టుకోవాలి, అలాగే ఇప్పుడు కూడా జీఎస్టీ సంస్కరణలమేలు వినియోగదారులకు అందాలి..

కొంతమంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ తీసుకున్న నిర్ణయన్ని ఇప్పటి వరుకు అధిక పన్నులు వేసి ఇప్పుడు తగ్గించారు అని వాదించే వారికి సమాధానం:

2 నుంచి 6 లక్షల కోట్లకి రక్షణ బడ్జెట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

స్వాతంత్ర్య వచ్చేక 60 ఏళ్ళల్లో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే 11 ఏళ్ళల్లో 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

24 గంటలు విద్యుత్ సరఫరా చేసే విధమైన కొత్త విద్యుత్ ప్రాజెక్టులు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

16000 గ్రామాలకు గత 6 ఏళ్ళల్లో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

ఇంటింటికి మరుగుదొడ్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?? గృహాలకు  12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం మరియు 2.5 లక్షల కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మాణం గత 11 సంవత్సరాలుగా పూర్తి అయ్యాయి 

పేదలకు కొత్తగా ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల సబ్సిడీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?? దేశంలో 3.50  కోట్ల గృహాలు పీఎంఏవై క్రింద పూర్తి అయ్యాయి, మరో 1 కోటి గృహాలు 2029 కి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.

రోజుకి 34 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

గరీబ్ కల్యాణ్ అన్న యోజన 80 కోట్ల మందికి ఉచిత బియ్యం 2021 నుండి ఇస్తున్నాం, ఇప్పటికీ దాదాపు 4.50 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరాయించింది.

కరోనా వ్యాక్సిన్ 220 కోట్ల డోసులు ఉచితంగా వేసిన ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరాయించింది.

జాతీయ రహదారులు 55 వేల కిలోమీటర్లు వేసి 1.46 లక్షల కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయడం జరిగింది. 8 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి జరిగింది.

రైల్వే లైన్ 45 వేల కిలోమీటర్లు విద్యుదీకరణ జరిగింది.

దేశంలో 1275 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లుగా దాదాపు  1 లక్ష కోట్ల వ్యయంతో  అభివృద్ధి - ఏపీ లో 73 ఉన్నాయి, మన నెల్లూరు రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ రైల్వే  స్టేషన్ కార్యక్రమంలో భాగంగా 102 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాము.

రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఒక్క ఏపీ లో 41 లక్షల రైతు కుటుంబాలకు అందుతుంది.

రైతులకు యూరీయా సబ్సిడీ ఒక్క ఏపీ కి సంవత్సరానికి 15 వేల కోట్లు మేరకు అందుతుంది.

ఇక జల్ జీవన్ మిషన్, సమగ్ర శిక్ష అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్, అమృత్, పీఎంఏవై, గ్రామీణ్ సడక్ యోజన, వంటి పథకాలు, మహిళలను లాక్ పతి దీదీలు మరియు డ్రోన్ దీదీ లను చేసే ప్రణాళిక, ఇలా గత 11 సంవత్సరాలుగా  55 కోట్ల జన్ ధన్ ఖాతాలు ద్వారా 45 లక్షల కోట్ల రూపాయల నగదు బదిలీ లీకేజ్ లేకుండా జరిగింది. అని గణాంకాలతో సహా ఆయన వివరించారు. 

              ఒంగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎస్టీ ని తగ్గించడం వలన కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అధికారులకు, చార్టెడ్ అకౌంటెంట్లకు పిలుపునిచ్చారు. ఈ ప్రయోజనాలను ప్రజలకు అందించకుండా ఎవరైనా మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ విత్తనాలకు అనుగుణంగా వ్యాపారస్తులు కూడా తమ వ్యవస్థలో మార్పులు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.  జీఎస్టీ తగ్గించడం వలన కలుగుతున్న ప్రయోజనాలను వివరిస్తూ  రూపొందించిన కరపత్రాలను ఈ సమావేశంలో అతిథులు ఆవిష్కరించారు.







            .

Post a Comment

Previous Post Next Post