శ్రీ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఏలూరు వివిధ ప్రాంతాలలో మహా అన్నదాన కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి.
అక్టోబర్ :- ఏలూరులో శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి. శరన్నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం 50 వ డివిజన్ తూర్పు లాకుల వద్ద వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో, 4 వ డివిజన్ మస్తాన్ మన్యం కాలనీలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగిన మహోత్సవముల సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అన్నిదానాల్లో అన్నదానం మిన్న అని అన్నారు. ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్, ఆలయ కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..

