పవన్ కళ్యాణ్ గారి 54 వ పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో బైక్ ర్యాలీ తో సంబరాలు జరుపుకున్న మెగా అభిమానులు, జనసైనికులు.





పవన్ కళ్యాణ్  గారి 54 వ పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో బైక్ ర్యాలీ తో సంబరాలు జరుపుకున్న మెగా అభిమానులు, జనసైనికులు.


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి 54 వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు వట్లూరు సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మెగా అభిమానులు మరియు జనసైనికులు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీగా సంబరాలు జరుపుకున్నారు..  పలువురు విద్యార్థులు, యువతీ యువకులు ఈ ర్యాలీలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు హాజరై బైక్ ర్యాలీ నీ ప్రారంభించారు. అనంతరం మెగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో పలువురు మెగా అభిమానులు, యువతీ యువకులు, జనసైనికులు పాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post