పెదవేగి జిల్లా శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డిజిపి (శిక్షణ) తమిళనాడు డాక్టర్ సందీప్ రాయ్ రాథోడ్ ఐపీఎస్.
డాక్టర్ సందీప్ రాయ్ రాథోడ్ ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్, తమిళనాడు, ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్ ఐపీఎస్ ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారితో కలిసి ఈ రోజు అనగా 10.09.2025 వ తేది నాడు ఏలూరు జిల్లాలోని పెదవేగి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించినారు
ఈ సందర్శనలో భాగంగా డిజిపి పెదవేగి ట్రైనింగ్ సెంటర్ లో పోలీస్ సిబ్బంది కి శిక్షణ లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
శిక్షణ సిబ్బంది నివాసాలు, ఆహార పదార్థాల నాణ్యత, మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన పాఠ్యాంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
శిక్షణలో సమగ్రత మరియు నాణ్యతను గురించి ఈ సందర్శన జరిగిందని అధికారులు తెలిపారు. భవిష్యత్ పోలీస్ అధికారులకు ఉత్తమ శిక్షణ అందించడానికి అవసరమైన మార్పులు మరియు మెరుగుదల లను గురించి కూడా చర్చించిన డాక్టర్ సందీప్ రాయ్ రాథోడ్ ఐపీఎస్ వారు
ఈ కార్యక్రమము లో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు ,డి టి సి, డీఎస్పీ ప్రసాద్ నూజివీడు డిఎస్పి కె వి వి ఎన్ వి ప్రసాద్ , ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు , డి టి సి ఇన్స్పెక్టర్ రామ రావు ,పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ , ఇన్స్పెక్టర్ ఆకుల రఘు ,ఆర్. ఐ పవన్ కుమార్ , కృష్ణ జిల్లా ఆర్ ఐ కృష్ణంరాజు ,పెదవేగి ఎస్ఐ రామ కృష్ణ , దెందులూరు ఎస్ఐ శివాజీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
