ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు అడిగితే చర్యలు తప్పవు: మండల విద్యాశాఖ అధికారి.




ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు అడిగితే చర్యలు తప్పవు: మండల విద్యాశాఖ అధికారి. 

( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు ) 

 ప్రకాశం జిల్లా కంభం: మండలంలోని ప్రైవేట్  పాఠశాలల యజమాన్యం RTE(12)1c చట్టం ద్వారా కేటాయించిన 25% ఉచిత ప్రవేశాలకు ఎలాంటి రుసుములను వసూలు చేయరాదని ఎంఈవో అబ్దుల్ సత్తార్ అన్నారు.
బడుగు,బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే ఆర్టిఈ ద్వారా 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు కేటాయించబడ్డారో, సదరు విద్యార్థులకు తప్పనిసరిగా ఫీజు మినహాయింపును ఇవ్వాలనీ, RTE(12)1c ద్వారా కేటాయించబడిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఎలాంటి అదనపు రుసుముల కొరకు ఒత్తిడి చేయరాదని కోరారు. 
కంభం మండలంలోని ప్రైవేట్  పాఠశాలల్లో  RTE(12)1c ద్వారా ఉచితంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులను స్కూల్ మెయింటెనెన్స్ ఫీజుల పేరుతో ఒత్తిడి చేస్తున్నారంటూ తల్లిదండ్రుల పిర్యాదు మేరకు సంబంధిత పాఠశాలలకు బుధవారం నోటీసులను అందజేశారు.
నిబంధనలు ఉల్లంఘించి ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కంభం మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్. తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post