పామాయిల్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ప్రభుత్వం పామాయిల్ కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
పామాయిల్ కార్మికులవి ప్రాణాలు కావా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జిల్లా గౌరవ అధ్యక్షులు పి రామకృష్ణ
జంగారెడ్డిగూడెం మండలం యు టీ ఎఫ్ భవనం లో టీ. సత్యనారాయణ అధ్యక్షతన పామాయిల్ కార్మిక సంఘం జిల్లా ప్రధమ మహాసభ జరిగింది.
జంగారెడ్డిగూడెం,
పామాయిలు గెలలు కోస్తూ విద్యుత్ షాక్ తో చనిపోతే అధికారులు, ప్రభుత్వం స్పందించరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు విమర్శించారు
సోమవారం నాడు జంగారెడ్డిగూడెం చింతలపూడి,టీ నర్సాపురం, జీలుగుమిల్లి, ద్వారకాతిరుమల, లింగపాలెం, కామవరపుకోట 150 మంది పామాయిల్ కార్మికులు ఈ మహాసభలో పాల్గొన్నారు. ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా తీశా సత్యనారాయణ జి సత్యనారాయణ హరీష వహించగా ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పామాయిల్ కార్మికుల పరిస్థితి దినదినగండంగా ఉందని అన్నారు. పామాయిల్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యానవన శాఖ, కార్మిక శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి పామాయిల్ కార్మికులు బల్పశులవుతున్నారని మండిపడ్డారు. ప్రమాదాల్లో చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఈ రెండు నెలల కాలంలోనే సుమారు 5మంది పామాయిల్ కార్మికులు విద్యుత్ షాక్ తగలే చనిపోయిన జిల్లా అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం, సీతానగరం టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం, జెగ్గవరం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం గ్రామాల్లో పామాయిల్ కార్మికులు విద్యుత్ షాక్ తగిలి చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. సంబంధిత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే,ఎంపీ కనీసం నోరు మెదకపోవడం సిగ్గుచేటు అన్నారు. పామాయిల్ కార్మికుల్ని మనుషులుగా కూడా చూడకపోవడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. పామాయిల్ కార్మికులు తలుచుకుంటే ఒకరోజు సమ్మె చేస్తే ఈ జిల్లాలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలు నడుస్తాయా అని ప్రశ్నించారు. పేదల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికారులు తీరుపై జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోరని మండ్డిపడ్డారు. రైతులు రోడ్డెక్కితే స్పందించే ఎంపీ గారు కార్మికులు రోడ్డు ఎక్కి గొడవ చేసిన కనీసం కనబడట్లేదా అని ప్రశ్నించారు. జిల్లా అధికారుల కనుసనల్లోనే పామాయిల్ ధరలు నిర్ణయిస్తుంటే పామాయిల్ తోటల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. జీవో నెంబర్ 73 ను అమలు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం,అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. అనంతరం వ్యవసాయం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రవి. మాట్లాడుతూ పేదవాడి బ్రకతూ సెటిల్ మెంట్ తోనే ముగిసి పోవాలా అని ప్రశ్నించారు. వీళ్లకి కనీసంగా ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. ఇంకా ఎంత మంది కూలీలు చావులు విద్యుత్ శాఖ అధికారులు పొట్టన బెట్టుకుంటారని మండిపడ్డారు. పామాయిలు గెలలు కోస్తున్న కూలీలు చావులేనా?ఈ చావుల నివారణకు విద్యుత్ అధికారులు అవగాహనా కల్పించాలన్న ఆలోచన కూడా లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. దీనికి బలి అయిపోతున్న వారి కుటుంబాల అర్ధనాధాలు ఎవరికి చెప్పుకోవాలన్నారు. దీనిపైన ఉన్నత అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మహాసభలో సంగం జిల్లా గౌరవ అధ్యక్షులు పి.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులుఎం. జీవరత్నం, ముత్యాలమ్మ, యు వెంకటేష్, దుర్గ పామాయిల్ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం సత్యనారాయణ, శ్రీను, హరీష్, రమేష్ రాంబాబు వెంకటాపురం గ్రామ సర్పంచ్ గారు హాజరైనారు. వీరితో పాటు మరో 150 మంది కార్మికులు పాల్గొన్నారు.
.jpeg)