దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణకు ఆదేశాలు.
ఈనెల 29న (సోమవారం), మూల నక్షత్రం రోజున, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారు, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారల దేవస్థానానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆదేశాలు జారీ చేశారు.
▪️సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3:30 గంటల నుండి 4:30 గంటల మధ్య పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
▪️ఇందుకోసం ప్రభుత్వం రూ.20,000/- లు మంజూరు చేసింది.
▪️సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి...
