ఇస్కఫ్ లక్ష్య సాధనకు కృషి చేస్తాం.
భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి, సంస్థ లక్ష్యాల సాధనకు కృషిచేస్తామని ఇస్కఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు బుడుమూరు వెంకట సూర్యనారాయణ రాజు (బి.వి. ఎస్.ఎన్.రాజు) పేర్కొన్నారు.
శనివారం జిల్లాకేంద్రంలోని ఎస్వీడి కళ్యాణమండపంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు ముఖ్య నిర్వహణ అధికారిగా ఇస్కఫ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి సనపల నర్సింహులు వ్యవహరించారు.
ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ ప్రజల మధ్య స్నేహం, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ఇస్కఫ్ లో సభ్యులుగా చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
సంఘం గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామమూర్తి మాట్లాడుతూ ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు ఇస్కఫ్ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమం జిల్లా శాఖ మాజీ అధ్యక్షులు మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా బుడుమూరు శ్రీరామమూర్తి, గౌరవ సలహాదారునిగా గేదెల ఇందిరా ప్రసాద్, అధ్యక్షునిగా బి.వి.ఎస్.ఎన్.రాజు, ఉపాధ్యక్షులుగా సనపల నారాయణరావు, సీపాన రామారావు, టి.కామేశ్వరి, సాహుకారి నాగేశ్వరరావు,
ప్రధాన కార్యదర్శిగా జి.వి.నాగభూషణరావు, కోశాధికారిగా కె.భాస్కరరావు, కార్యదర్శిగా గురుగుబెల్లి రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా దిబ్బ ప్రసాదరావు, గేదెల లక్ష్మి, టి.తిరుపతిరావు, సాధు కామేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా నాగేశ్వరరావు, ఈశ్వరరావు, చౌదరి సత్యనారాయణ, వడ్డాది విజయకుమార్, కుంచి చిన్నారావు, టి.వి.రమణ, తంగి ఎర్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఇస్కఫ్ జిల్లా సంఘం నాయకులు, తెలుగు రచయితల సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

