దానగూడెం దళితవాడ బాధితులను పరామర్శించిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు.




 

దానగూడెం దళితవాడ బాధితులను పరామర్శించిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు.


సెప్టెంబర్ 13:- ఈనెల 5 వ తేదీన కైకలూరులో జరిగిన ఘర్షణలో గాయపడిన దానగూడెం దళితవాడకు చెందిన యువకులను (బాధితులను) శనివారం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు పరామర్శించారు. దానగూడెంలోని ఐబీఎమ్ చర్చిలో బాధిత కుటుంబ సభ్యులను మరియు గ్రామస్థులను ఆయన పరామర్శించారు. యువకులతో మాట్లాడానని వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని తెలిపారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అధిష్టానం ఆదేశాల మేరకు దానగూడెం దళితవాడకు చెందిన బాధితుల పరామర్శకు వచ్చానన్నారు. ఇకపైన ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సంఘటనకు కారణమైన వారు పోలీసు వారి అదుపులో ఉన్నారని తెలిపారు. ఇకపైన కైకలూరు లోని ప్రజలందరూ కులాలు మతాలకు అతీతంగా సోదరుల వలే కలిసి ఉండాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహుల వలలో పడకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. పరామర్శించిన వారిలో జనసేన ఏలూరు నగర అధ్యక్షులు వీరంకి అంజిత్ కుమార్ (పండు), జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.‌.

Post a Comment

Previous Post Next Post