పెదవాగు రిజర్వాయర్ నుండి దిగువకు వరద నీరు విడుదల - పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి.


 పెదవాగు రిజర్వాయర్ నుండి దిగువకు వరద నీరు విడుదల -   పరిసర ప్రాంతాల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -   జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి.

 వేలేరుపాడు/ఏలూరు, సెప్టెంబర్, 13: పెదవాగు రిజర్వాయర్ నుండి దిగువ విడుదల చేస్తున్న వరద నీరు పెరుగుతున్న దృష్ట్యా పెదవాగు పరిసర ప్రాంతాలు దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెదవేగి రిజర్వాయర్ నుండి ఇప్పటికే 10 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగవకు విడుదల చేశారని రేపటికి ఇది మరింత పెరగవచ్చని దీని కారణంగా వేలేరుపాడు మండలంలోని కుమ్మరిగూడెం, గొల్లగూడెం, వసంతవాడ, గుండం బోరు, మద్దికొండ, లచ్చి గూడెం, రుద్రంకోట, అల్లూరి నగరం, కోయ మాదారం, రామవరం, గొల్లవాయి, రెడ్డిగూడెం, బండ్ల పూర్, భూదేవిపేట, శివకాశి పురం, వేలేరుపాడు 17 నివాసత ప్రాంతాలు వరద ముంపు రావచ్చని, కావున ప్రజలందరూ అధికారులతో సహకరించి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కోరారు. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయడం జరిగిందని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

 ఏలూరు కలెక్టరేట్ లో 1800-233-1077 మరియు 94910 41419 ఫోన్ నంబర్లతో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, అదేవిధంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్.. ఫోన్ నెంబర్ 8309269056. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ 8328696546 కుక్కునూరు తాసిల్దార్ కార్యాలయంలో 8096274662 ఫోన్ నెంబర్ తో కంట్రోల్ ఏర్పాటు చేశామన్నారు. . బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని, రాష్ట్ర విపత్తు నివారణ దళం ను కూడా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ వెట్రి సెల్వి తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post