మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేత.


 

మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేత.


 ఆంధ్ర ప్రదేశ్ అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఈ రోజు ఘనంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా మొత్తం 15,941 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికై నియామక పత్రాలు స్వీకరించారు.

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో వేమూరు శాసన సభ్యులు శ్రీ నక్కా ఆనంద బాబు, కూడా పాల్గొని, విజేతలకు స్వయంగా నియామక పత్రాలను అందజేశారు.

1994 నుంచి 2025 వరకు 14 డీఎస్సీలు నిర్వహించి 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబు గారిదని, అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ , బీజేపీ చీఫ్ మాధవ్ గారు తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు నియామక పత్రాలు అందజేయడం ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఉత్సాహం నింపబడిందని శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు, తెలిపారు.

Post a Comment

Previous Post Next Post