శ్రీ మహాలక్ష్మిగా దుర్గమ్మ దర్శనం...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి... శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు...!!
మహాలక్ష్మీ అమ్మవారికి వేకువ జాము నుంచే దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు.
మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారు అమితమైన పరాక్రమంతో ....
డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది.
అన్ని సౌఖ్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ
ఆ దేవిస్వరూపమే. దీనికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారు.
బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, ఇంటిల్లిపాదికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా,
కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా…
అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి.
తన ఓర్పు, నేర్పుతో ఈ విజయాలన్నీ సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది వీటి అంతరార్థం.
పురుషుడు ఎంత ధనవంతుడైనా, భార్య చేదోడు వాదోడుగా నిలవకపోతే ఆ సంపద వ్యర్థమే అవుతుంది.
ఎటువంటి సంతృప్తినీ అది అందించదు. పురుషుడికి నిజమైన సంపద…ఇల్లాలు. ఆమె అందించే సహకారం మాత్రమే.
లోకస్థితికారిణిగా, ధన, ధ్యాన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజ లక్ష్మీలుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణిగా...
శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీ మహా లక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని దర్శించటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం...
*జై దుర్గా భవాని.. జై జై దుర్గా భవాని*
