సంక్షేమ బోర్డును పునరుద్దరించాలి సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు.


 సంక్షేమ బోర్డును పునరుద్దరించాలి 

సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు .


క్రైమ్ 9 మీడియా ప్రతినిధి :- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను పునరుద్దరించాలని సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. స్థానిక జి ఆర్ ఆర్ అండ్ టి పి  ఆర్ కళాశాల  ఆవరణలో  ఆ సంఘం మండల మహా సభ టి దానం అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం జరిగిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ రద్దు చేసిన 40 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్దరించాలని, క్లయిములు చెల్లించాలని, బోర్డుకు బకాయిలు చెల్లించాలని, జీవో నంబర్ 1214 ను రద్దు చేయాలని కోరారు. కోరికల సాధనకు సెప్టెంబర్ 15 న రాష్ట్ర కార్మిక కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. స్కిమ్ వర్కర్ల వేతనాలు పెంచాలని కోరారు. అంగన్వాడీలకు ఎఫ్ ఆర్ ఎస్ యాప్ రద్దు చేసి, సెల్ఫోన్, నెట్ వర్క్ సదుపాయం ప్రభుత్వమే కల్పించాలని తీర్మానించారు. మధ్యాహ్న భోజన కార్మికుల మెనూ పెంచాలని, ఆశ వర్కర్ల రికార్డుల, వి వో ఏ ల సమస్య పరిష్కరించాలని మరో తీర్మానం చేశారు. అసంఘటిత రంగంలోని ముఠా, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఇంకో తీర్మానం చేశారు. నూతన సిఐటియు కంభం మండల కమిటీ కన్వీనర్ గా ఎస్కే అన్వర్, కో కన్వీనర్ గా బళ్లారపు రోశయ్య ఎన్నికయ్యారు. ఎస్ కే నాయబ్ రసూల్, ఎం రమణ, ఎస్కే  రియాజన్, ఎస్కె జైనాబి, జి కేతూర, టి సరళ, సిరిగిరి రాజ శేఖర్, అబ్దుల్ రహిమాన్, కాసీం వలి, శివ కుమార్, కాశీరత్నమ్మ, పఠాన్ జానీ భాషా, ఏ ఆదిలక్ష్మి,  స్వర్ణ కుమారి సభ్యులుగా వున్నారు.

Post a Comment

Previous Post Next Post