
వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెబ్సైట్ ను ప్రారంభించింది.
మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు.
అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు.
బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరి.
ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఉద్దేశించబడింది : డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.
Tags
ANDRAPRADESH
EAST GODHAVARI DIST
ELURU
ELURU DIST
INDIA
KAAKINAADA DIST
latest news
NANDYALA
NTR DIST
PRAKASHAM DIST
SATYASAI
SRI SATYASAI DIST
THIRUPATHI DIST
VISAKHAPATANAM DIST
WEST GODAWARI