ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70 వ పుట్టినరోజు వేడుకలు.
ఏలూరు, ఆగస్టు 22:- పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70 వ జన్మదిన వేడుకలను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజై కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సినీ రంగంలో తనకంటూ ముద్ర వేసుకుని నటనలో ఎంతో ఉన్నత స్థాయికి కష్టపడి ఎదిగి ఎందరికో, స్ఫూర్తినిస్తున్న వ్యక్తి పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. సినీ రంగంలోనే గాక సేవా రంగంలోను మొదటగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ అని అన్నారు. ప్రమాదవశాత్తు రక్తమందక ఎంతోమంది మరణానికి గురవుతుంటే, అటువంటి మరణాలు మరల పునరావృతం కాకుండా ఉండాలని రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేయించి, ఎంతోమంది అభిమానుల చేత రక్తం దానం చెయ్యాలని వారిలో స్ఫూర్తిని కల్పించిన వ్యక్తి డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే కంటి చూపు లేని వారికి నేత్రదానం చేయమని ప్రజలకు మరియు అభిమానులకు సూచనలు చేసిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిదే. అటువంటి సేవాభావం కలిగిన వ్యక్తి చిరంజీవి గారు, ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు సరిది రాజేష్, గౌరీ శంకర్, ఏలూరు మెగా ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మారం హనుమంతరావు (అను), మెగా అభిమానులు శానం శ్రీ రామకృష్ణ మూర్తి,పి.జగన్, ఈదుపల్లి పవన్, డి.పెదబాబు, కట్టా ఆది, నరేష్,కోమాకుల శ్రీను, దోసపర్తి రాజు, అరవింద్, కళ్యాణ్ మరియు భారీ సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.
