ANDRAPRADESH: పాలకొల్లులో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ – “నిమ్మల రామానాయుడు గారు రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నారు. వారి కుటుంబంలో జరిగే ఈ శుభకార్యానికి హాజరవడం నాకు ఆనందంగా ఉంది. వధూవరులు దాంపత్య జీవితంలో సుఖసంతోషాలతో, ఐశ్వర్యసంపదలతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.
అనంతరం మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారిని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మర్యాదపూర్వకంగా కలుసుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల పురోగతి వంటి పలు విషయాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నిశ్చితార్థ వేడుకను విజయవంతం చేశారు.
