ఏలూరు అమీనాపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.





క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దేశ స్వయం ప్రతిపత్తిని, భారతీయుల భవిష్యత్తును కాపాడేందుకు ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏపి ఆప్కాబ్‌ ఛైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు అమీనాపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏపి ఆప్కాబ్‌ ఛైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మిఠాయిలను పంచారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో దేశ స్వయం ప్రతిపత్తితో పాటూ, భావితరాల వారి ఉజ్వల భవిష్యత్తును కాపాడేందుకు ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం సమసమాజ స్థాపనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ భారతావనిని 2047 నాటికి అగ్రగామి దేశంగా నిలిపే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా శ్రమిస్తున్నాయన్నారు. ప్రజలు కూడా ఈ ఆశయ సాధనకు బాసటగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపి మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఎఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ పప్పు ఉమామహేశ్వరరావు, టిడిపి నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో - ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...


 

Post a Comment

Previous Post Next Post