పాఠశాల విద్యార్థులందరినీ యూ డైస్ లో నమోదు చేయాలి:ఎంఈవో.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా కంభం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరినీ తప్పనిసరిగా యూ డైస్ ఆన్లైన్ పోర్టల్ నందు నమోదు చేయాలని ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక ఎంఈవో కార్యాలయంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. భౌతికంగా పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి యూడైస్+లో జీపీ,ఈపీ,ఎఫ్పీలను నవీకరిస్తూ అపార్ ఐడీ, పెన్ నంబర్లను క్రియేట్ చేయడం తప్పనిసరి,తనిఖీల్లో వ్యత్యాసాలను ఉపేక్షించబోమన్నారు.
