రాచర్ల మండల ఫారం గ్రామ సమీప పరిసరాల్లో పులి సంచారం.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామ శివారులోని కంచనగుంట తిప్ప ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు.
అక్కడ పులిజాడలు కనిపించడంతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఈ విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
పులి సంచరిస్తున్న అవకాశముందని, గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి సంచారం గమనిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
