వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రకాశం జిల్లా పోలీసు వారి సూచనలు...
గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్, ఉత్తర్వుల మేరకు మార్కాపురం డిఎస్పి యు. నాగరాజు ఆద్వర్యంలో కంభం CI కే. మల్లికార్జున మరియు కంభం SI బి. నరసింహరావు వినాయక చవితి సందర్భంగా కంభం మండల ప్రజలకు, ఉత్సవ కమిటీ సభ్యులు పాటించవలసిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల పై పలు సూచనలు తెలిపినారు.
🔷పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో రూపొందించిన విగ్రహాలు కాకుండా సహజసిద్దంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపినారు.
వినాయక విగ్రహాలు/మండపాల ఏర్పాటు సందర్భంగా పాటించవలసిన నియమాలు.‼
✅ “ వినాయక విగ్రహ ప్రతిష్ఠ/ పందిళ్ళు/మండపాలు" ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా పోలీస్ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
✅“వినాయక విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు/మండపాలు” ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత ఉత్సవ నిర్వహకులు కమిటీగా ఏర్పడి, వారి వివరాలు పోలీస్ స్టేషన్ లో తెలిపి, వారి గుర్తింపు కార్డు నకలు కాపీలు పోలీస్ వారికి అందజేసి అందరూ స్టేషన్ హాజరు అయ్యి సంతకాలు చేసి అనుమతి పొందవలెను.
✅ విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా పోలీస్ వారికి తెలియజేయాలి.
✅ ప్రయివేట్ స్థలాలు, గ్రామా/వార్డు/పంచాయతీ కి సంబంధించిన స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా సదరు ప్రవేటు స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే గ్రామా/వార్డు/పంచాయతీ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోని ఆ అనుమతి పత్రం ను పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారికి అందచేయవలయును.
✅ మండల పరిధిలో ప్రధాన రహదారులకు, ముఖ్య కూడళ్ళలో ట్రాఫిక్ కు, ప్రజలకు, ఇబ్బంది కలిగే విధంగా విగ్రహాలు పెట్టరాదు.
✅ పెద్ద పెద్ద బ్యానర్లు, ప్లెక్సీలు, పొలిటికల్ రెచ్చగొట్టే విదంగా ప్లెక్సీలు మరియు బానెర్లు పెట్టరాదు. రోడ్డుపైన రాకపోకలకు అంతరాయంగా పెట్టరాదు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించరాదు.
✅ అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖల తదితర శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకుని, వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు/మండపాలు వద్ద అగ్ని మాపక ఉపకరణాలలో భాగంగా ఇసుక మరియు నీటి క్యాన్లను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
✅ వాతావరణ శాఖ సూచన మేరకు మండపాలు దగ్గర విద్యుత్ఘాతాలు జరగటానికి అవకాసం ఉంది కాబట్టి ఉత్సవ నిర్వహకులు బాద్యత వహించి జాగ్రత్త పాటించవలయును.
✅ పందిళ్ళు/మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు పాటిస్తూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను ఉపయోగించాలి. రాత్రి 10 గం. తర్వాత ఎటువంటి స్పీకర్స్ ఉపయోగించరాదు.
✅ మండపాలు/ పందిళ్ళ వద్ద ఉత్సవ నిర్వహకులు విధిగా ఒకరు అయిన ఉండవలయెను. మండపాల వద్ద ప్లెక్సీలు గాని ఇతర సామాగ్రి గాని పాడు అయిన యెడల ఉత్సవ నిర్వహకులు బాద్యత వహించవలయును.
✅ మండపాలు/ పందిళ్ళ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు పొలిటికల్ గ రెచ్చగొట్టే వఖ్యానాలు కాని మరియు ఇతరులను కించపరిచే మాటలు కాని చేయరాదు.
✅ మండపాలు/ పందిళ్ళ వద్ద పార్టీలకు సంభదించిన పాటలు గాని మరియు మతపరమైన పాటలు గాని పెట్టరాదు. అల పెట్టిన యెడల పూర్తిగా ఉత్సవ నిర్వహకులు బాద్యత వహిస్తారు.
విగ్రహాల ఊరేగింపు సమయంలో పాటించవలసిన నియమాలు.‼️
✅ వినాయక విగ్రహ నిమజ్జన సమయంలో శాంతియుతంగా, ఇతర ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా విగ్రహాల ఊరేగింపును చేపట్టాలి. ఆ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో భారీ లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండు సామాగ్రిని పేల్చడం చేయరాదు.
✅ వినాయక విగ్రహ నిమజ్జన సమయంలో పార్టీలకు సంభదించిన పాటలు గాని మరియు మతపరమైన పాటలు గాని పెట్టరాదు. అల పెట్టిన యెడల ఉత్సవ నిర్వహకులు పైన చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.
✅ వినాయక విగ్రహ నిమజ్జన సమయంలో ఆరోజు మసీదు నందు నమాజు సమయంలో పాటలు పెట్టరాదు మరియు మసీదు ల వద్ద గులాములు చల్లరాదు మరియు మతపరమైన పాటలు గాని పెట్టరాదు. అల పెట్టిన యెడల ఉత్సవ నిర్వహకులు పైన చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.
✅ పందిళ్ళ వద్ద మరియు ఊరేగింపు సమయాలలో, అసభ్యకరమైన డాన్సులు, ఇతర ప్రదర్శనలు నిర్వహించరాదు, పెద్దపెద్ద శబ్దాలు వచ్చే DJ బాక్సులు ఉపయోగించరాదు.ఇవి జరుగకుండా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలి.
✅ నిమర్జన ఊరేగింపు సమయంలో శాంతియుతంగా, ఇతర ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్ కి ఎడమ వైపున మాత్రమె విగ్రహాల ఊరేగింపును చేపట్టాలి.
✅ నిమర్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమర్జనకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే నిమజ్జనం చేయాలి.
✅ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారుడు మరియు కార్యనిర్వాహకులే బాధ్యత వహించవలసి ఉంటుంది.
✅ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే నిర్వాహకులు లేదా కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాటించాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలో తలెత్తితే పూర్తి బాధ్యత నిర్వాహకులు లేదా కమిటీ సభ్యుల పైన ఉంటుందని, కావున వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులే తగిన భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలని ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటే ముందుగానే మాకు తెలియపరచాలని, పైన సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తీ శ్రద్దలతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని అలాగే పోలీస్ వారికి సహకరించవలసిందిగా కంభం CI కే. మల్లికార్జున గారు మరియు కంభం SI బి. నరసింహరావు గారు తెలిపినారు.
