స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన..
* ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని హేళన చేయడమే వైసీపీ పని..
* స్త్రీ శక్తి స్కీం విజయవంతం కావడంతో తట్టుకోలేకపోతున్న వైసీపీ పార్టీ..
* ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు, ఆగస్టు 20:- కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన లభిస్తోందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు.. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అని అన్నారు.. ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని అవహేళన చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు.. దిగ్విజయంగా అమలవుతున్న స్త్రీ శక్తి పథకాన్ని చూసి కడుపుమంట తో ఓర్వలేకపోతుందని ఆయన మండిపడ్డారు.. రాష్ట్ర వ్యాప్తంగా 15 వ తేదీ 76,430 మంది, 16 వ తేదీ 10,84,303 మంది, 17 వ తేదీన 15,47,175 మంది, 18 వ తేదీన 18, 78, 625 మంది, 19 వ తేదీన 17,67,822 మంది అంటే సరాసరి రోజుకు రాష్ట్రంలో 18 లక్షల మంది చొప్పున మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు.. విజయవాడ జోన్ పరిధిలో 15 వ తేదీ 22,614 మంది, 16 వ తేదీ 2,87,178 మంది, 17 వ తేదీ 3,98,583 మంది, 18 వ తేదీ 4,94,062 మంది, 19 వ తేదీ 4,57,595 మంది మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో 16, 60,032 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు రూ.6.30 కోట్లు లబ్థి చేకూరుతుందన్నారు.. ముఖ్యంగా ఆసుపత్రులకు, పుణ్య క్షేత్రాలకు వెళ్ళేవారు, చిరుద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు పై వైసీపీ నాయకులు వారి సలహాలు సూచనలు ఇవ్వాలే కానీ అక్కసుతో ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు.. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, జనసేన రవి, బోండా రాము నాయుడు, వీర మహిళ గుదె నాగమణి తదితరులు పాల్గొన్నారు.
