నల్లకాలువ , నర్సిరెడ్డి పల్లె గ్రామంలో పొలం పిలుస్తుంది.





నల్లకాలువ , నర్సిరెడ్డి పల్లె గ్రామంలో పొలం పిలుస్తుంది.

( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు )

 ప్రకాశం జిల్లా కంభం మండల వ్యవసాయ అధికారి  షేక్ మహమ్మద్ మంగళవారం నల్లకాలువ , నర్సిరెడ్డి పల్లె గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించినారు. అన్నదాత సుఖీభవ రాని వారు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు,పంటల భీమా ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 31వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు 
ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం ప్రత్తి, కొర్ర పంటను పరిశీలించి పలు సూచనలు తెలియజేశారు.
 పొలంలో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు కు నీరు నిలిస్తే. బయటకు తీసివేసి 20 కేజీ ల యూరియా మరియు 10 కేజీల పొటాష్ లను ఎకరానికి వేయాలని, లేదా 19.19.19 లేదా పొటాషియం నైట్రేట్ 1కేజీ లు ఎకరానికి పిచికారీ చేయాలని రైతులకు వివరించారు. కార్యక్రమంలో వి ఏ ఏ  లు ప్రశాంత్, సాయి రైతులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post