అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని..సచివాలయ సిబ్బందికి ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ సూచన.



అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలి.

ప్రతి అర్జీకి పరిష్కారం చూపడంలో మీరు ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

సచివాలయ సిబ్బందికి ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ సూచన.

ప్రజలు ఇచ్చిన అర్జీలతో 27వ వార్డు సచివాలయానికి వెళ్లిన శ్రీరామ్.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని.. అందులో ఎక్కువగా మీ పాత్రే ఉందని సచివాలయ సిబ్బందితో ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం కోసం ఆయన 2వ రోజు కూడా సచివాలయాలకు వెళ్లారు. పట్టణంలోని 21, 27,32,34 సచివాలయాలకు టీడీపీ నాయకులు అర్జీలతో వెళ్లారు. ఇందులో 27వ సచివాలయానికి శ్రీరామ్ స్వయంగా వెళ్లి.. ప్రజలు ఇచ్చిన అర్జీల గురించి చర్చించారు. ఇందులో సంక్షేమ పథకాలకు సంబంధించి.. చిన్న చిన్న కారణాలతో అర్హులకు పథకాలు అందకపోవడం గురించి మాట్లాడారు. వీటిని వెంటనే సంబంధిత పత్రాలు అప్ లోడ్ చేసి.. పథకాలు వచ్చేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఇళ్లు, ఇంటి పట్టాలు, చేనేతల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, పింఛన్లు వంటి దరఖాస్తులు ఎలాంటి తప్పిదాలు లేకుండా అప్ లోడ్ చేయాలన్నారు. అర్హులకు ఎక్కడా అన్యాయం జరగకూడదన్నారు. సచివాలయ స్థాయిలో పరిష్కారమయ్యే అర్జీల బాధ్యత మీదేనన్నారు. హౌస్ మ్యాపింగ్ కు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ప్రతి అర్జీ విషయంలో జవాబుదారీగా ఉండాలన్నారు. ఏ అర్జీని ఎవరి వద్దకు తీసుకెళ్తే.. పరిష్కారం అవుతుందనేది స్పష్టంగా చూడాలని శ్రీరామ్ సూచించారు.

Post a Comment

Previous Post Next Post