ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు..


ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు..

రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌..

సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదన్న హైకోర్టు..

ఆర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ తీర్పును అనుసరించాలని సూచన..

ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్‌ఐఆర్‌లు వద్దు..

రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా..?లేదా.? 
మెజిస్ట్రేట్‌లు కచ్చితంగా సర్క్యులర్‌ అమలు చేయాలని ఆదేశం...

ఏపీ హైకోర్టు ముఖ్య సూచనలు:
************
3 నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉన్న కేసుల్లో, విచారణ అధికారి ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి..

ఈ కేసు విచారణను 14 రోజుల లోపు పూర్తి చేయాల్సిందే..

ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే డీఎస్పీ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరి..

మేజిస్ట్రేట్లు ఈ ఆదేశాలను అతిక్రమిస్తే హైకోర్టు సీరియస్ గా పరిగణిస్తుంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఎదురవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. 

ఈ సర్కులర్ ప్రకారం మానవ హక్కుల పరిరక్షణతో పాటు ఆచరణలో పోలీసులు, న్యాయవ్యవస్థ బాధ్యతగా వ్యవహరించాలని నిర్దేశించిన హైకోర్టు.

Post a Comment

Previous Post Next Post