శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించిన అనకాపల్లి జిల్లా పోలీసులు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి, ఆగస్టు :07 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ప్రకటించిన పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా, అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నిర్వహించబడింది. జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ,పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ వెనుకబడిన వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, సామాజిక చైతన్యవేత్త అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యత, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహిస్తూ గౌరవించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐలు బాల సూర్యరావు, లక్ష్మి, సతీష్, రమేష్, రమణయ్య, ఎస్సైలు ప్రసాద్, అంజిబాబు మరియు కార్యాలయ సిబ్బంది మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మకి ఘన నివాళులర్పించారు.
