కంభం పోలీస్ ల ఆధ్వర్యంలో హరితాంద్ర కార్యక్రమం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆసియా ఖండంలో రెండో చెరువుగా గుర్తింపు పొందిన కంభం చెరువు కట్టపై హరితంద్ర కార్యక్రమం లో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ కంభం మండల తాసిల్దార్ వి కిరణ్. పోలీస్ సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన కోరారు..


