చట్ట ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలి: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బడగల బల్లయ్య.


 చట్ట ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలి: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బడగల బల్లయ్య.

క్రైమ్ 9 మీడియా – శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి: శంకర్ తమ్మినాన.

పలాస, జూలై 26:

మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయన కుమారుడి అరెస్ట్ నేపథ్యంలో పలాస మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బడగల బల్లయ్య మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాలని, చట్ట ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలకు తొందరపడకుండా చట్టాన్ని గౌరవించాలని సూచించారు.

డాక్టర్ సీదిరి అప్పలరాజు గతంలో ప్రజలకు సేవలందించిన వ్యక్తిగా తనకు తెలిసిన విషయాలను ప్రస్తావిస్తూ, ఆయనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన విచారణ అనంతరం నిజానిజాలు బయటపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే, ఈ ఘటనలో మృతి చెందిన దాన్నయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కేసులో చట్ట ప్రక్రియను ఎలాంటి ప్రభావాలకు అతీతంగా కొనసాగించి, సంబంధిత అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.

రాజకీయ భేదాభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన విధానాలు పరిరక్షించబడాలని, ప్రజల్లో నమ్మకం పెరిగేలా వ్యవహరించడం అవసరమని బడగల బల్లయ్య పేర్కొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post