లక్కీ షాపింగ్ మాల్ ఉద్యోగికి అండగా నిలిచిన యాజమాన్యం, సిబ్బంది.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస జూలై 25:
మానవత్వాన్ని చాటుతూ లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం, మేనేజ్‌మెంట్ మరియు సిబ్బంది తమ సహోద్యోగి కుటుంబానికి ఆర్థిక చేయూత అందించారు. లక్కీ షాపింగ్ మాల్‌లో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న నరేంద్ర భార్య అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆమె వైద్య ఖర్చుల కోసం యాజమాన్యం, మేనేజ్‌మెంట్, సూపర్వైజర్లు మరియు సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు రూ.20,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో లక్కీ షాపింగ్ మాల్ ఎండీ శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు, శ్రీ గ్రంధి సుబ్రహ్మణ్యం గారు (స్వామి సార్), శ్రీ శ్రీ రామ్ రత్తయ్య గారు, మేనేజర్లు స్వామి యాదవ్ గారు, శంకర్ బాబు గారు, శ్రీహరి యాదవ్ గారు, అలాగే సూపర్వైజర్లు మరియు సిబ్బంది అందరూ పాల్గొని నరేంద్ర కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కష్టసమయంలో సహోద్యోగికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన సమయంలో మానవత్వంతో ముందుకు రావడం లక్కీ షాపింగ్ మాల్ ప్రత్యేకత అని తెలిపారు.
ఆర్థిక సహాయం అందించిన లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం, మేనేజ్‌మెంట్, సూపర్వైజర్లు మరియు సిబ్బందికి నరేంద్ర కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
