​మహిళలకు అభయం – సమాజానికి గౌరవం".

​మహిళలకు అభయం – సమాజానికి గౌరవం".

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జూలై 15, 

మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత ధ్యేయంగా అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన "అభయ" ప్రత్యేక కార్యక్రమమును బుధవారం నాడు ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు చోడవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సీఐ అప్పలరాజు ఆధ్వర్యంలో అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంఅత్యంత వైభవంగా ప్రారంభమైంది.ఈ సందర్బంగా సీఐ అప్పలరాజు మాట్లాడుతూ

మహిళల రక్షణే ఈ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటించారు. 'అభయ' కార్యక్రమం ద్వారా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ మహిళల రక్షణ కోసం ఒక అద్భుతమైన కవచాన్ని నిర్మించిందని, మహిళలు ఏ సమయంలోనైనా భయం లేకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడమే తమ పోలీస్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.

​వేధింపులకు గురవుతున్నా, సైబర్ నేరాల బారిన పడుతున్నా మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లాలో మహిళా సాధికారత, భద్రతను పటిష్టం చేయడానికి ఈ 'అభయ' కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, ఈ అద్భుతమైన చొరవను తీసుకున్న జిల్లా పోలీస్ అధికారులును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

​కేవలం పోలీసుల పరంగానే కాకుండా, జిల్లా యంత్రాంగం తరఫున రెవెన్యూ, పోలీస్, మరియు మహిళా-శిశు సంక్షేమ శాఖల (WCD) సమన్వయంతో తామంతా కలిసి పనిచేస్తామని, క్షేత్రస్థాయిలో ప్రతి మహిళకు అత్యంత వేగవంతమైన సేవలు, భద్రత అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

​మహిళల రక్షణ కోసం 'మీ భద్రత... మా బాధ్యత' అనే నినాదంతో ఈ 'అభయ' ప్రాజెక్టును అత్యంత ప్రణాళికాబద్ధంగా తీసుకువచ్చామని తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీసుల నిరంతర కృషి ఫలితంగా జిల్లాలో మొత్తం నేరాల రేటు 28.42% మేర తగ్గడం విశేషమని ఆయన గర్వంగా ప్రకటించారు.  

​ఈ ప్రాజెక్టు కింద మొత్తం 10 ప్రధానాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెబుతూ, స్కూళ్లు, కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 'శక్తి బీట్' అధికారులను, శక్తి టీమ్స్ మరియు ఉమెన్ సేఫ్టీ బీట్స్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తున్నామని వివరించారు. బాధితులకు గృహాల వద్దే కౌన్సిలింగ్ ఇవ్వడం, నిరంతరం వేధించే నేరస్థులపై రౌడీ షీట్లు తెరవడం, సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సమాజ భాగస్వామ్యం, రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా వాడకం ద్వారా మహిళలపై జరిగే నేరాలను ముందస్తుగా నియంత్రిస్తారు ఆపద సమయంలో తక్షణ రక్షణ మరియు భద్రతను చేకూరుస్తారు.బాధితులకు మానసిక, వైద్య మరియు చట్టపరమైన భరోసా కల్పిస్తూ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తారు.సత్వర దర్యాప్తు జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చార్జ్‌షీట్లు దాఖలు చేస్తారు.  

శక్తివంతం చేయండి చట్టాలపై విస్తృత అవగాహన కల్పించి మహిళల ఆత్మవిశ్వాసాన్ని, సాధికారతను పెంచుతారు.  

మహిళలపై జరిగే నేరాలను గుర్తించండి - అప్రమత్తంగా ఉండండి!

​ఈ కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు సైబర్ క్రైమ్స్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా మహిళలు సమాజంలో మరియు ఆన్‌లైన్‌లో ఎదుర్కొనే క్రింది నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు:  

​గృహ హింస, కార్యాలయాల్లో లైంగిక వేధింపులు, 

​ఆఫ్‌లైన్ & ఆన్‌లైన్ వేధింపులు, ఈవ్ టీజింగ్ / పబ్లిక్ హరాస్‌మెంట్  

​లైంగిక దాడి / దాడులకు ప్రయత్నించడం, 

​సైబర్ బుల్లీయింగ్ & ఆన్‌లైన్ వేధింపులు,  

​ఫోటోల మార్ఫింగ్ మరియు రివెంజ్ పోర్న్, 

బాల్య వివాహాలు

​గుర్తుంచుకోండి: "మౌనంగా ఉండటం నేరస్థుడిని కాపాడుతుంది.. సమాచారం ఇవ్వడం ఇతరులను రక్షిస్తుంది."

​ఆపదలో ఉన్నారా? కేవలం ఒకే ఒక్క కాల్ దూరంలో సహాయం!

​మహిళలు నేరుగా తమ సమస్యలను అధికారుల దగ్గరికి తీసుకువెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన "అభయ పోస్టర్లు" మరియు "అభయ ఫిర్యాదులు

మహిళల తక్షణ రక్షణ మరియు సహాయం కోసం అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను నిరంతరం అందుబాటులో ఉంచింది. ఏ క్షణంలోనైనా ఆపద ఎదురైతే వెంటనే సహాయం పొందేందుకు దేశవ్యాప్త అత్యవసర పోలీస్ సహాయ నంబర్ 112 కు కాల్ చేయవచ్చు. అలాగే ప్రత్యేక మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, మరియు సైబర్ నేరాల బారిన పడితే తక్షణమే ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లను సంప్రదించవచ్చు. వీటితో పాటు మహిళలు తమ ఫిర్యాదులను సులువుగా పంపిచ వచ్చని సీఐ అప్పలరాజు తెలిపారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సైలు నాగకార్తీక్. జోగారావు పోలీస్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాలుగున్నారు

 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post