మునగపాక పోలీసుల ఆకస్మిక దాడి: 3.310 కిలోల గంజాయి స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్.


 మునగపాక పోలీసుల ఆకస్మిక దాడి: 3.310 కిలోల గంజాయి స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్.

సరుగుడు తోటలో ప్యాకెట్లు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.

నిందితులకు 14 రోజుల రిమాండ్: మునగపాక పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జిల్లా..మునగపాక, జూలై 08: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మరియు పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ బి.మోహన రావు గారి ఆదేశాల మేరకు, ఎలమంచిలి రూరల్ సీఐ శ్రీ ధనుంజయ రావు పర్యవేక్షణలో మునగపాక సబ్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద రావు మరియు వారి సిబ్బంది మత్తుపదార్థాల నిర్మూలనే ధ్యేయంగా ముమ్మర దాడులు నిర్వహించారు.మునగపాక పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులపల్లి గ్రామ శివారులో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంపై బుధవారం మునగపాక పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. సరుగుడు తోటలో విక్రయానికి సిద్ధమవుతుండగా..నాగులపల్లి గ్రామ శివారులోని సరుగుడు తోటలో నిందితులు గంజాయిని సేవిస్తూ, ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ సహాయంతో 20 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమాయక యువతకు విక్రయించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు చాకచక్యంగా చుట్టుముట్టి రౌండప్ చేశారు.

అరెస్ట్ అయిన నిందితుల వివరాలు:

1.​కాండ్రేగుల జై వినయ్

2.​ఉండు దుర్గ సాయి @ సాయినాథ్ 

3.​వెదురుపర్తి జయరాం

4.​బండారు వరుణ్ కుమార్

5.​భీమిశెట్టి మిధున్ కుమార్

స్వాధీనం చేసుకున్న సొత్తు:

​గంజాయి: 3.310 కిలోలు

​ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్: 01

​మొబైల్ ఫోన్లు: 03

​మోటార్ సైకిళ్లు: 04 (నేరానికి ఉపయోగించినవి)

​14 రోజుల రిమాండ్:

​ఈ ఘటనపై మునగపాక పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 109/2026 కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీనితో నిందితులను జైలుకు తరలించడం జరిగింది.

​జిల్లా ఎస్పీ గారి ప్రత్యేక అభినందనలు:

​సమాచారం అందిన వెంటనే అత్యంత వేగంగా, వ్యూహాత్మకంగా స్పందించి నిందితులను పట్టుకోవడమే కాకుండా, పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న మునగపాక ఎస్ఐ పి.ప్రసాద రావును, పర్యవేక్షించిన సిఐ ధనుంజయ రావును మరియు వారి సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. 

జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల రవాణా మరియు విక్రయదారులపై ఇలాంటి కఠిన చర్యలు మున్ముందు కూడా కొనసాగుతాయని ఎస్పీ గారు హెచ్చరించారు.

ప్రజలకు విజ్ఞప్తి:

​జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ, డయల్-112 లేదా EAGLE టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1972కు సమాచారం అందించాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

స్టేషన్ హౌస్ ఆఫీసర్, మునగపాక పి.ఎస్, అనకాపల్లి జిల్లా.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post