కనిగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కనిగిరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేస్తూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పోలీసు అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా ఎస్ పి.కనిగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, ఎన్నికలకు సంబంధించిన రికార్డులు మరియు పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ స్టేషన్పై పూర్తి స్థాయి సమాచారాన్ని ముందుగానే సేకరించాలని ఎస్పీ సూచించారు.
పోలింగ్ కేంద్రాల భవనం, ప్రవేశం–నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, టాయిలెట్లు, వాహనాల పార్కింగ్, భద్రతా పరంగా అనుకూలత వంటి అంశాలను పరిశీలించి పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
గత ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్లు లేదా గ్రామాల్లో జరిగిన ఘర్షణలు, కేసులు, వివాదాలు మరియు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కనిగిరి పోలీస్టేషన్ SI గారికి సూచించారు. గత ఎన్నికల అనుభవాలను విశ్లేషించి, సమస్యాత్మక గ్రామాలు మరియు పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, పాత నేరస్తులు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ గారు ఆదేశించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైన చోట PIRలు నమోదు చేసి MRO గారివద్ద హాజరు పరచి బైండవార్ చేయించండి , వారి ప్రవర్తనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న NBW (Non-Bailable Warrant) ముద్దాయిల ఆచూకీని గుర్తించి, చట్టపరమైన ప్రక్రియను వేగవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ కేసుల దర్యాప్తును సమీక్షిస్తూ, కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామానికి సంబంధించిన శాంతిభద్రతల పరిస్థితిపై కానిస్టేబుళ్ల సహకారంతో ముందస్తు సమాచారాన్ని నిరంతరం సేకరించాలని ఎస్పీ తెలిపారు.
గ్రామాల్లోని ముఖ్యమైన వ్యక్తులు, సున్నితమైన ప్రాంతాలు, పాత వివాదాలు, భూవివాదాలు, రాజకీయ పరమైన విభేదాలు తదితర అంశాలపై ముందస్తు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రివెంటివ్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్య ఏర్పడిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సమస్యను గుర్తించి నివారించే విధంగా పోలీసింగ్ ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి పోలీసు అధికారి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశించారు.
