కంభం ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం.



 కంభం ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

-విద్యార్థుల సంఖ్య పెంపులో విశేష కృషికి ప్రశంసాపత్రం

 మార్కాపురం జిల్లా కంభం: మండలంలోని ఎన్‌ఆర్‌ తురిమెళ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీ హెచ్ భాస్కర్‌ నాయుడు గారికి అరుదైన గౌరవం లభించింది. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్యను పెంపొందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు ఆయనను పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు అభినందించారు.

శుక్రవారం పొదిలిలోని బాలాజీ కళ్యాణమండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సుబ్బారెడ్డి గారు, జిల్లా విద్యాశాఖ అధికారి సామా సుబ్బారావు గారి చేతుల మీదుగా భాస్కర్‌ నాయుడు గారికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయనను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్యను పెంపొందించి, నాణ్యమైన విద్య అందించడంతో పాటు తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంపొందించేందుకు భాస్కర్‌ నాయుడు గారు చేస్తున్న కృషిని అధికారులు ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఆయన తీసుకున్న ప్రత్యేక చర్యలు, విద్యాభివృద్ధి కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు విద్యావేత్తలు భాస్కర్ నాయుడు గారిపై ప్రశంశల జల్లు కురిపించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు అబ్దుల్ సత్తార్ గారు,పత్తి శ్రీనివాసులు గారు సిఆర్పీలు, ఎంఈవో కార్యాలయ సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post