వేదిక ఒక్కటే - పోటీ విభాగాలు వేరు - లక్ష్యం మాత్రం పతకమే.


 వేదిక ఒక్కటే - పోటీ విభాగాలు వేరు - లక్ష్యం మాత్రం పతకమే.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తండ్రీ కూతురు.

కూతురు కార్తికకు వెండి.

తండ్రి లక్ష్మణ్‌కుమార్‌కు బంగారు పతకం.

మార్కాపురం,అక్టోబరు 4,.

తిరువూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బండారు కార్తిక చిన్నారుల విభాగంలో వెండి పతకం, ఆమె తండ్రి బండారు వెంకట లక్ష్మణ కుమార్ పెద్దల విభాగంలో బంగారు పతకం సాధించారు.

చిన్నారుల విభాగంలో పాల్గొన్న బండారు కార్తిక అద్భుత ప్రతిభ కనబరిచి వెండి పతకాన్ని కైవసం చేసుకుంది*. అదే పోటీల్లో పెద్దల విభాగంలో బరిలోకి దిగిన ఆమె తండ్రి బండారు వెంకట లక్ష్మణ కుమార్ అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకం సాధించారు

ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు వేర్వేరు విభాగాల్లో పోటీ పడుతూ రాష్ట్రస్థాయి వేదికపై పతకాలు సాధించడం విశేషంగా నిలిచింది.

 క్రీడలపై ఆసక్తి, పట్టుదలతో సాధన చేస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చని వీరి ప్రదర్శన చాటిచెప్పిందని పలువురు పేర్కొన్నారు.

తండ్రీకూతుళ్ల విజయాల పట్ల కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post