ఏలూరులో మేయర్ పీఠం దక్కించుకున్న జనసేన.
నగర మేయర్ పీఠం జనసేనకు దక్కడంతో జనసేన శ్రేణుల్లో హర్షం.
ఏలూరు అభివృద్ధి లో బడేటి చంటి గారు, పుట్టా మహేష్ యాదవ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు.
రేపు జరుగనున్న తన నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కూటమి నాయకులు హాజరై ఆశీర్వదించాలని ప్రార్థన.
ఏలూరు మేయర్ పీఠం జనసేనకు రావడానికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాధవ్ గారికి, నాదేండ్ల మనోహర్ గారికి, బడేటి చంటి గారికి, పుట్టా మహేష్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
మీడియా సమావేశంలో ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, అక్టోబర్ 16:- ఈనెల 28వ తేదీన జరుగును ఏలూరు మున్సిపాలిటీ సంస్థల ఎన్నికలకు ఏలూరు నగర కూటమి మేయర్ అభ్యర్థిగా జనసేనకు రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదేండ్ల మనోహర్ గారికి, ఎమ్మెల్యే బడేటి చంటి గారికి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. దాదాపు 30 సంవత్సరాలకు పైబడి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నట్లు రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.. తన జీవితం ఒక సాధారణ హమాళీ కార్మికుడిగా ప్రారంభమైందన్నారు.. గ్రేడ్ యూనియన్ కార్మికుడిగా, గ్రామపంచాయతీలో ఎంపీటీసీగా, సర్పంచ్ గా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అవగాహన తనకు ఉందన్నారు. అంతేకాకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నానని, ఏలూరులోని సమస్యలపై తనకి అవగాహన ఉందన్నారు.. ఇటువంటి తరుణంలో తనకు ఈ అవకాశం తగ్గడం అదృష్టంగా భావిస్తున్నట్లు రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.. ఏలూరు జనసేన పార్టీ తరఫున, కూటమి మేయర్ అభ్యర్థిగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.. 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజున ఉన్నటువంటి విధ్వంసాన్ని, వైసీపీ అనే అరాచక ప్రభుత్వాన్ని, అరాచక శక్తుల్ని పారద్రోలడం కోసం కూటమిలో జనసేన, బీజేపీ, టిడిపి శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేశామన్నారు.. ఏలూరులో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రతి ఒక్కరు ప్రధాన భూమికను పోషించామన్నారు.. అదే ఒరవడితో ఈ రెండున్నర సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న, సంక్షేమం, అభివృద్ధి ఏలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునే విధానం, నిరంతరం మా ఫ్రెండ్లీ ఎమ్మెల్యే బడేటి చంటి గారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించడం అభినందనీయం అని అన్నారు.. మౌలిక వసతుల కల్పన, కార్పొరేషన్ నుంచి నిధులు రావడంలో, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు గాని, గౌరవ ఎంపీ మహేష్ యాదవ్ గారి ద్వారా ఎంపీ నిధులు గాని రావడంలో ఎంతో కృషి చేస్తున్నారు.. ఏలూరు మేయర్ పీఠాన్ని భారీ మెజారిటీ తో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బహుమానంగా ఇస్తామని ఆయన అన్నారు.. ఏలూరులో గణనీయమైన మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి విషయాల్లో మంచి పరిపాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే చంటిగారికి, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. అదే సహృదయంతో ఈ రోజున ఏలూరు నగర మేయర్ కూటమి అభ్యర్థిగా తనకు వచ్చిన ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.. ఈనెల 28వ తేదీన జరుగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, జనసేన శ్రేణులు, ఎన్డీఏ కూటమి నాయకులను, ఏలూరు నగర ప్రజలందరినీ ఈ సందర్భంగా తన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.. ఏ విధమైన మనస్పర్ధలు, విభేదాలు రాకుండా సక్రమంగా ఏలూరు ప్రజలకు అన్ని మౌలిక వసతులను సమకూర్చుతామని ఈ సందర్భంగా తెలిపారు.. కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రజల యొక్క ఆశీస్సులు ఆదరణ ఉండే విధంగా మా యొక్క పరిపాలన కొనసాగుతుందన్నారు.. కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ టిడిపి పార్టీ ఒక ఉమ్మడి కుటుంబంలా ఉంటున్నామని, రానున్న రోజుల్లో ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆయన కోరారు.. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావడం సహజమే, చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు ఏ విధంగా కూర్చుని పరిష్కరించుకుంటామో, ఇప్పుడు కూడా ఇదే విధంగా పరిష్కరించుకొని ముందు తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా రేపు ఏలూరులో రానున్న రోజుల్లో అందరం కలిసి ప్రయాణం చేస్తామని అన్నారు.. రేపు ఉదయం 11 గంటల నుండి జరగనున్న తన నామినేషన్ కి భారీ సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు, ఎన్డీఏ కూటమి నాయకులు హాజరై తనను ఆశీర్వదించి జరుగనున్న ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు.. ఈ సమావేశంలో జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకిపండు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్, బొండా రాము నాయుడు, బెజవాడ నాగభూషణం, పైడి లక్ష్మణరావు, అల్లు సాయి చరణ్, బొత్స మధు, జనసేన రవి, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు.
