పోషణ మాసోత్సవ.సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8వరకు.


పోషణ మాసోత్సవ.సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8వరకు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం జిల్లా కంభం గ్రామపంచాయతీలో కోడ్ 69.71.97 అంగన్వాడీ సెంటర్లో పోషకాహార మాసోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ గాలమ్మ పాల్గొని. మాసోత్సవ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా దొరికే ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు తీసుకోవాలని అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే రాగులు బెల్లము వేరుశనగ చిక్కిలో మునగాకు పొడి తీసుకోవడం వలన రక్తహీనత రాకుండా ఉంటుందని గర్భిణీలు చిన్న పిల్ల తల్లులు బలమైన ఆహారం తీసుకోవాలని ఆమె తెలియజేశారు.

ముందుగా అంగన్వాడి కార్యకర్తలతో మరియు పిల్లల తల్లులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఝాన్సీ. ఎం ఎల్ హెచ్ పి స్వాతి. నాగమణి. మహాలక్ష్మి. బివి లక్ష్మి. ఆశ వర్కర్ లక్ష్మి. శివమ్మ. మాధవి. తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post