స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు.



 స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలు శనివారం సంబంధిత అధికారులతో ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

జిల్లాస్థాయి అధికారులను ప్రస్తుతం అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించినందున తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం 

అన్ని పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో 27 జడ్పిటిసిలు, 373 ఎంపీటీసీలు, 517 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిపించాల్సి ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి రావాల్సిన సామగ్రి వచ్చినందున, స్థానికంగా సమకూర్చుకోవాల్సిన సామాగ్రి కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, మున్సిపాలిటీల విషయంలో కందుకూరు మినహా ఇతర అన్ని మున్సిపాలిటీలో అవసరమైన చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సమర్థంగా చేయడం ద్వారా ఈ ప్రక్రియను విజయవంతంగా సగం పూర్తి చేసినట్లు అవుతుందన్నారు. అందుకే రెగ్యులర్ విధులతోపాటు ఎన్నికల విధులకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సమావేశంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ అనుపమ, మండలాల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post