ఏబీసీ మండలాల బలిజ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా దేవరశెట్టి బ్రహ్మయ్య.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం శ్రీకృష్ణ దేవరాయ బలిజ ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడిగా, బేస్తవారిపేట మండలం సింగరపల్లి గ్రామానికి చెందిన, డిప్యూటీ ఎంపీడీవో, దేవరశెట్టి బ్రహ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆదివారం ఉదయం, స్థానిక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో, కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల, బలిజ ఉద్యోగులు సమావేశమై, 2026 - 28 సంవత్సరాలకు, సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంఘ ప్రధాన కార్యదర్శిగా కంభం మండలానికి చెందిన రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, మునగాల మురళీకృష్ణ, కోశాధికారిగా, అర్ధవీడు మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్, నామాల బాలయ్య, అలాగే శాశ్వత మహిళా ఉపాధ్యక్షురాలిగా, కంభం మండల పరిషత్ కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న, వాడపల్లి కళ్యాణి లను, సంఘ సభ్యులు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం చేత, సంఘ గౌరవ అధ్యక్షులు, పులి శ్రీనివాస ప్రసాద్, ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గాన్ని, తాజా మాజీ కార్యవర్గం సూరే ప్రసాద్, తోట కోటేశ్వరరావు, పి ఆర్ ఎల్ రఘువీర్, పి రాజశేఖర్, కాసుల పాండు, ఓ సి హెచ్ నరసింహులు, శెట్లెం వేణుగోపాల్, కురంగి మల్లికార్జున, దేవిరెడ్డి నాగేంద్రుడు తదితరులు సన్మానించారు.

