ఫ్లెక్సీలు కరపత్రాలతో మద్యం టెండర్ల కోసం ప్రచారం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ వేగవంతం
అర్ధవీడులో 2, బేస్తవారిపేటలో 1 షాపునకు టెండర్ల ఆహ్వానం
ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా అధికారుల విస్తృత ప్రచారం
కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నూతన మద్యం దుకాణాల కేటాయింపు టెండర్ల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఎక్సైజ్ శాఖ తాజా నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్ పరిధిలో అర్ధవీడు మండలంలో రెండు (2) మద్యం షాపులకు, అలాగే బేస్తవారిపేట మండలంలో ఒక (1) మద్యం షాపునకు టెండర్లు నిర్వహిస్తున్నారు. కంభం, బేస్తవారిపేట మరియు అర్ధవీడు ప్రాంతాల వ్యాపారులకు, ప్రజలకు ఈ టెండర్ల ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది తొ ప్రత్యేకంగా విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.
ఇందులో భాగంగా సంబంధిత మండలాల తహశీల్దార్ (MRO) కార్యాలయాలు, మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ( ఎంపీడీవో ) కార్యాలయాలలో నిబంధనలతో కూడిన ప్రత్యేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దుకాణాల లొకేషన్లు, మరియు దరఖాస్తు రుసుము వంటి పూర్తి వివరాలతో కూడిన అధికారిక సమాచార కరపత్రాలను స్థానిక కార్యాలయాలకు వచ్చే ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. టెండర్లలో పాల్గొనదలచిన ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1 లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని, మరిన్ని వివరాల కోసం స్థానిక ఎక్సైజ్ కార్యాలయాన్ని లేదా ఆయా మండల కార్యాలయాలను సంప్రదించాలని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా కోరారు.

