బహుజనులకు రాజ్యాధికారం కావాలి.
చత్రపతి సాహు మహరాజు 152 వ జయంతి సందర్భంగా గిద్దలూరు పట్టణంలో కంచర్ల కోటయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో బహుజన సమావేశం జరిగినది. ఈ సమావేశం ఉద్దేశించి కంచర్ల కోటయ్య గౌడ్ గారు చత్రపతి సాహు మహారాజ్ గారు భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వమే తన రాజ్యంలో బహుజనులకు ఉద్యోగాలు కల్పించి బహుజన రాజ్యాన్ని స్థాపించారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ లుగా బహుజనులందరూ ఎన్నికలలో పోటీ చేయాలని బహుజనులందరినీ కోరారు, గ్రామ గ్రామంలో బహుజనులతో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా సభలు నిర్వహిస్తామన్నారు. బహుజనులపై ఈ డబ్ల్యూ ఎస్ అత్యంత దారుణమైన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు గుడిసే మహబూబ్బాషా, బీసీ నాయకులు కటారి అరుణ్ కుమార్ యాదవ్, రజక సంఘం అధ్యక్షులు చెన్నయ్య, నాయి బ్రాహ్మణ అధ్యక్షులు తొండమల్ల బ్రహ్మయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు ఆకుమల్ల కోటేశ్వరరావు, పగిడి రమేష్ యాదవ్, జయరాజు, కంచర్ల స్వామి గుండమయ్య పాల్గొన్నారు.
