ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంజీవని డాటా డిజిటల్ నెర్వె సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు వైద్యశాలలో అక్కడ అందుతోన్న వైద్య సేవలను సమీక్షించిన తర్వాత రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతోన్న చికిత్సలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పీహెచ్‌సీ ద్వారా అందిస్తున్న ఔట్ పేషెంట్ సేవలు, మాతా-శిశు ఆరోగ్య కార్యక్రమాలు, బాలికల ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాలపై డాక్టర్ పునూరు శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వ్యాధుల స్క్రీనింగ్, ఔషధాలు, నిర్ధారణ పరీక్షల అందుబాటు వంటి వాటిపై చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్ట్రేషన్ విభాగం, వైద్యుల కన్సల్టేషన్ గదులు, స్టాఫ్ నర్స్ సేవల కేంద్రం, ల్యాబ్, ఫార్మసీ, కౌన్సెలింగ్, ఫాలోఅప్ వ్యవస్థలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
